దృత‌రాష్ట్రుడు లైవ్ టెలికాస్ట్ విన్నాడు

news02 May 31, 2018, 5:41 p.m. general

mahabharatam

ల‌క్నో: మ‌హాభార‌త కాలంలోనే ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలున్నాయంటా...! మ‌హాభార‌త స‌మ‌యానికే జ‌ర్న‌లిజం అభివృద్ధి చెందిందంటా...! అంతేకాదు కురుక్షేత్ర యుద్దాన్ని కూడా అప్ప‌టి చానెళ్లు లైవ్ టెలికాస్ట్ చేశాయంటా..! విన‌డానికి వింత‌గా ఉంది కాదు. మ‌హాభార‌త కాలంలో ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలేమిటి మ‌న ఖ‌ర్మ కాక‌పోతే అనుకుంటున్నారా..?. అవునండీ...యూపీ మంత్రి  దినేష్ శర్మ చేసిన ఇలాంటి విచిత్ర వ్యాఖ్య‌లే ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా హాట్ టాపిక్‌గా మారాయి.

drutarastrudu

కురుక్షేత్ర యుద్ధం ప్ర‌త్యేక్ష ప్ర‌సారాలు జ‌రిగిన‌ట్లు దినేష్ శ‌ర్మ చెబుతున్నారు. 'హిందీ జర్నలిజం డే ప్రోగ్రాంకు హాజ‌రైన ఆయ‌న ఈవ్యాఖ్య‌లు చేశారు. అస‌లు కురుక్షేత్రాన్ని లైవ్ టెలికాస్ట్ చేయ‌క‌పోతే...సంజయుడు హస్తినాపురంలోనే ఉండి కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి ఎప్పటికప్పుడు దృతరాష్ట్రుడికి ఎలా వివ‌రించాడ‌ని ప్ర‌శ్నిస్తున్నాడు. మరి ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటని జోకేలేస్తున్నాడు. 

dinesh sharma

అయితే మంత్రి చేసిన ఈవ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డంతో.. నెటిజ‌న్లు మంత్రిపై వంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. పాపం దినేష్ శ‌ర్మ‌కు మ‌తి భ్ర‌మించో.. లేక నెత్తి దెబ్బ త‌గిలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చ‌ని కామెంట్స్ పెడుతూ వేల‌కోలం చేస్తుండ‌డం విశేషం. 

tags: mahabharatam,dinesh sharma,up minister, kurukshetram,bjp

Related Post