గుంటూరులో పవన్ సొంతింటికి భూమిపూజ

news02 March 12, 2018, 10:18 a.m. general

గుంటూరుజిల్లాలో తన సొంత ఇంటి నిర్మాణానికి జనసేన అధిపతి పవన్ సతీసమేతంగా భూమి పూజ నిర్వహించారు.  కాజా టోల్ గేట్ సమీపంలో రెండు ఎకరాల స్థలంలో పవన్ నూతన నివాసం నిర్మిస్తున్నారు.  భూమిపూజకు పవన్ సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. భూమి పూజ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరి సహకారం కావాలని కోరారు. ఆవిర్భావ సభలో ప్రత్యేక హోదా అంశంపైమాట్లాడతానని పవన్ చెప్పారు. 14న జరిగే ప్లీనరీలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదన్న పవన్ .. అభిమానులు ముందుకొచ్చి కాజాలో స్థలం చూపించారని తెలిపారు. తన నివాసానికి సమీపంలోనే పార్టీ కార్యాలయం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందనే గుంటూరులో ఇంటి నిర్మాణం చేపట్టినట్లు పవన్ స్పష్టం చేశారు.

tags: pavan, guntur, andhrapradesh, politics, janasena

Related Post