గోదావ‌రిలో మునిగిన లాంచీని గుర్తించిన పోలీసులు

news02 May 16, 2018, 10:34 a.m. general

godavari botu

అమ‌రావ‌తి: మంగ‌ళ‌వారం తూర్పుగోదావరి జిల్లా మంటూరు - పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య గోదావరి నదిలో గ‌ల్లంతైన లాంచీని పోలీసులు గుర్తించారు. లాంచీ 40 అడుగుల లోతులో ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. లాంచీ ఇసుక‌తో నిండిపోవ‌డంతో..3 బోట్ల స‌హాయంతో దాన్ని బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశం అట‌వీ ప్రాంతంలో ఉండ‌డంతో.. అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి కొంత ఇబ్బంది ప‌డుతున్నారు. అందువ‌ల‌నే రెండు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎస్ బృందాలు ఎప్పటిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 

godavari botu

మంగ‌ళ‌వారం 50 మంది తూర్పుగోదావ‌రి జిల్లా మంటూరు నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి వాడ‌ప‌ల్లి వెళ్లుతున్న సంద‌ర్భంగా ఈప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. వీరు ప్ర‌మాణిస్తున్న స‌మ‌యంలో తీవ్ర‌మైన గాలుల‌తో పాటు భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో... లాంచీ అదుపు త‌ప్పి గోదావ‌రిలో మునిగిపోయింది. ఈప్ర‌మాదంలో 35 మంది గ‌ల్లంతు అయ్యారు. మ‌రికొంత మంది అతి క‌ష్టం మీద ఈదుకుంటు ఒడ్డుకు చేరుకున్నారు. అయితే అప్ప‌టి నుంచి గాలింపు చేప‌ట్టిన అధికారులు బుధ‌వారం లాంచీ గోదావ‌రి అడుగు భాగంలో ఉన్న‌ట్లు గుర్తించారు. 

tags: lanch,godavari,water,rain,godavariincident

Related Post