అంగరంగ వైభవంగా ఆకాశ్ పెళ్లి

news02 March 11, 2019, 8:34 p.m. general

akash

అపర కుబేరుడు ముకేశ్‌ ముద్దుల తనయ ఈశా వివాహ వేడుక  ఇంకా మన కళ్లముందు కదలాడుతూండగానే.. ఆయన తనయుడు ఆకాశ్‌ అంబానీ వివాహాన్ని మరింత వైభవోపేతంగా జరిపించారు. తన చిన్ననాటి స్నేహితురాలు, రోజీ బ్లూ డైమండ్స్‌ సీఈఓ రసెల్‌ మెహతా గారాల పట్టి శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నాడు ఆకాశ్‌.  శనివారం రాత్రి ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ముందు తన తల్లిదండ్రులు ముకేశ్‌, నీతాలు, సోదరి ఈశా అంబానీతో కలిసి తాత ధీరూబాయ్‌ అంబానీ చిత్రపటానికి ఆకాశ్‌ నివాళులు అర్పించారు. ఆ తర్వాత నాయనమ్మ కోకిలా బెన్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఎప్పుడూ సూటూబూటుల్లో కనిపించే ఆకాశ్‌ అంబానీ సంప్రదాయ దుస్తుల్లో వరునిగా ముస్తాబై మెరిసిపోయారు. 

akash

బారాత్‌లో గుర్రంపై ఊరేగుతూ నృత్యాలు, బ్యాండు బాజాల హోరు మధ్య జియో వరల్డ్‌ సెంటర్‌లోని వివాహ వేదికకు చేరుకున్నారు. అతిథుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రసిద్ధ వంటకాలను ఏర్పాటు చేసి ఆతిథ్యంలోనూ తమకు తామే సాటి అని చాటారు అంబానీలు. బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌, చెర్రీ బ్లెయిర్‌, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ బాన్‌ కి మూన్‌, టాటా సన్స్‌ గ్రూపు గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా, గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, టాటాగ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, ఆర్సెలర్‌ మిత్తల్‌ అధినేత లక్ష్మీ మిత్తల్‌, సచిన్‌ తెందూల్కర్‌, హార్దిక్‌ పాండ్యా, కృణాల్‌ పాండ్యా, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌, రజనీకాంత్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య బచ్చన్‌, అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, ప్రియాంకా చోప్రా తదితరులు హాజరయ్యారు.

akash

tags: akash, akash ambani, akash ambani marriage, akash ambani wedding, akash ambani grand marriage, akash ambani sloka piramal marriage

Related Post