చ‌త్తీస్‌ఘ‌డ్ నుంచి ఇక్క‌డికి బ‌దిలీ

news02 July 7, 2018, 12:08 p.m. general

cj radhakrishna

హైద‌రాబాద్: ఏపీ,తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న చేత గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఇంత‌కు ముందు చ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేసిన రాధాకృష్ణ‌న్ బ‌దిలీపై ఇక్క‌డికి వ‌చ్చారు. అయితే కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక సీజేగా ర‌మేష్ రంగ‌నాథ్ కొన‌సాగుతున్నారు. ఈనేప‌థ్యంలోనే కొలిజీయం సిఫార్సు మేర‌కు కేంద్ర న్యాయ శాఖ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చీఫ్ జ‌స్టిస్‌గా రాధాకృష్ణ‌న్‌ను నియ‌మిస్తూ...ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగానే ఆయ‌న చేత గ‌వ‌ర్న‌ర్ శ‌నివారం ప్ర‌మాణ స్వీకారం చేయించారు. 

radha krishna

రాధాకృష్ణ‌న్ నేప‌థ్యం...
1959 ఏప్రిల్ 29న కేర‌ళ కోల్లాంలో జ‌న‌నం.
సెయింట్ జోసెఫ్‌, ఆర్య‌న్ సెంట్ర‌ల్ స్కూల్ తిరువ‌నంత‌పురంలో విద్యాభ్యాసం పూర్తి.
ట్రినిటీ&ఎఫ్ఎఫ్ ఎంఎన్ క‌ళాశాల‌ల్లో ఇంట‌ర్ పూర్తి.
క‌ర్నాట‌క‌లోని కోలార్ కోల్డ్‌ఫీల్డ్స్ లో లా పూర్తి. 
1983లో తిరువ‌నంత‌పురంలో న్యాయ‌వాద వృతిని చేప‌ట్టిన రాధాకృష్ణ‌న్‌.
అనంత‌రం కేర‌ళ హైకోర్టుకు మ‌కాం మార్చిన రాధాకృష్ణ‌న్‌.
సివిల్‌,రాజ్యాంగం,ప‌రిపాల‌న విష‌యాల్లో ప‌ట్టు.
2004లో కేర‌ళ హైకోర్టులో పూర్తి స్థాయి జ‌డ్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాధాకృష్ణ‌న్‌.
చ‌త్తీస్‌ఘ‌డ్ హైకోర్టు సీజేగా విధులు
తాజాగా ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌ల స్వీకర‌ణ.

tags: cj radhakrishna,ap,telangana high court,high court,telangna high court,chief justice radhakrishna,cj radhakrishna,cj of ap,cj of telangana,cj of apandtelangana,chief justice of andrapradesh,hyderabad high court,ramesh rangarajan,telangana,andra pradesh,kerala,chattisghar,chattishgar high court chief justice

Related Post