న్యూఢిల్లీ: కొందరు ఎన్ఆర్ఐలు ప్రేమ,పెళ్లి పేరు చెప్పి ఇండియాలో అమ్మాయిలతో ఆడుకోవడం తెలిసిందే. బ్రాండెడ్ కార్లు, దుస్తులు, కాస్ట్లీ లైఫ్ స్టైల్ చూపించి... అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఆతర్వాత ఇక్కడి నుంచి బిచనా ఎత్తేయడం మామూలే. అయితే ఇక ముందు ఇలాంటీ ఆటలు నడవవంటా...! ఇలాంటీ జల్సాలకు అలవాటు పడి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకొని...వారితో ఆటలాడితే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అలాంటి వారి తాట తీసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇక్కడ పెళ్లి చేసుకొని... తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్ఆర్ఐ భర్తల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలాంటీ చర్యలకు పూనుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిర్యాదు మేరకు పోలీసులు, కోర్టు సమన్లు లెక్కచేయని వారిపై ఉక్కు పాదం మోపబోతుంది. అలాంటీ వారి ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు చట్ట సవరణలు తేవాలని యోచిస్తోంది.
అలాగే ఇండియాలో పెళ్లిలు చేసుకొని ఇక్కడ నుంచి పరారైన వారి జాబితాను వెబ్సైట్లో పెట్టాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బావిస్తోంది. అంతేకాదు వారి ఆస్తుల స్వాధీనం, పాస్‌పోర్టుల రద్దు వంటి తీవ్ర చర్యలు కూడా చేపట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగానే వివాహమైన 48 గంటల్లోగా ఎన్ఆర్ఐ వివాహాలను విధిగా రిజిస్టర్ చేయించాలన్న నిబంధనను సత్వరం అమలు చేసేందుకు సర్కారు పూనుకుంది.
సో NRIలు ఇక ముందైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే కేంద్రం కొత్తగా తేబోతున్న చట్ట సవరణతో చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.