పెంచిన హరి హర వీరమల్లు మూవీ టిక్కెట్ ధరలు ఇవే
ఈనెల 24 న పవన్ హరి హర వీరమల్లు గ్రాండ్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న తాజా సినిమా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) విడుదలకు సిద్దమైంది. ఈ మూవీకి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులు. అందాల తార నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. హరి హర వీరమల్లు జులై 24న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు టిక్కెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఐతే కేవలం మొదటి 10 రోజులకు మాత్రమే టిక్కెట్ ధరలు పెంచడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. జులై 24 నుంచి ఆగస్టు 2 వరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్ పై జీఎస్టీతో కలిపి పై రూ.100, అప్పర్ క్లాస్ పై రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇక మల్టీప్లెక్స్ లో జీఎస్టీతో కలిపి రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. హరి హర విరమల్లు మూవీ విడుదలకు ముందు రోజైన జులై 23న రాత్రి 9 గంటల పెయిడ్ ప్రీమియర్ కు సైతం చంద్రబాబు సర్కార్ అనుమతి ఇచ్చింది. పెయిడ్ ప్రీమియల్ టికెట్ ధర రూ.600 గా నిర్ణయించారు. ఎంపిక చేసిన కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ షోకు అనుమతినిచ్చారు.
ఇక సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో పాటు, పోలీస్ శాఖను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఇక తెలంగాణలోను టికెట్ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దీనిపై ఇంతవరకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోలేదు. టిక్కెట్ ధరల పెంపుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu Review) సినిమా ఈనెల 24 న విడుదలవుతుండటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా విడుదలయ్యే ధియేటర్స్ ను పవన్ ఫ్రెక్సీలు, కౌటవుట్ లతో ముస్తాబు చేస్తున్నారు.