N Convention

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జునకు (Akkineni Nagarjuna) ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు ట్విస్ట్ ఇచ్చింది. మాధాపూర్ లో నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ (N Convention) ను ఈ తెల్లవారు జాము నుంచి కూల్చివేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిర్యాడు మేరకు హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తోంది. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈక్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం పలు విషయాలను ప్రస్తావించింది.

హైకోర్టులో నాగార్జున దాఖలు చేసిన పిటీషనవ్ లో.. అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి సర్వే ప్రకారం స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిలో ఎన్‌ కన్వెన్షన్ ను నిర్మించారు. 2010-12 లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పూర్తయింది. ఐతే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీచేసిన భూమి మీద మరో మూడు, నాలుగు సర్వే రిపోర్టులు సర్క్యులేషన్‌లో ఉన్నాయి. దీంతో నాగార్జున ప్రభుత్వ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించారు. 9 కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని అంగీకరించారు. అందుకు సమ్మతించిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్ కన్వెన్షన్ అంశం స్టేలో ఉండగా, దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని.. పేర్కొన్నారు.


Comment As:

Comment (0)