News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ కు బంగ‌పాటు త‌ప్ప‌దు ..!

komatireddy fire on kcr

నల్గొండ : హుజూర్​ నగర్​ ఉపఎన్నిక రాష్ట్రంలో నియంత పాలనకు తెలంగాణ ఆడపడుచుకు జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి . ఈ యుద్ధంలో హుజూర్​ నగర్​ ప్రజలు కాంగ్రెస్​ పక్షాన నిలబడి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్​ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

- Advertisement -

సోమవారం హుజూర్​ నగర్​ ఉప ఎన్నికకు ఉత్తమ్​ పద్మావతి నామినేషన్​ దాఖలు చేస్తున్న సందర్భంగా తనతో పాటు భువనగిరి లోక్​ సభ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారని కోమటిరెడ్డి తెలిపారు. అనంతరం హుజూర్​ నగర్​ లో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.