శత్రువులులేని లైఫ్‌ అంటేనే వేస్ట్‌రా

ఒకడికి శత్రువులు ఎక్కువౌతున్నారంటే వాడి ఎదుగుదలను చూసి వాళ్లందరు భయపడుతున్నారని అర్థం. అప్పుడే నువ్వు నీ పని సక్రమంగా చేస్తున్నావని అర్థం. శత్రువులులేని లైఫ్‌ అంటేనే వేస్ట్‌రా! ఇలాంటి శత్రువులు ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోతారు’ అంటున్నారు ‘వీఐపీ 2’ చిత్రంలో ధనుష్‌ తండ్రి సముతిరకని. ధనుష్‌ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ను ఉద్దేశించి ఆయన తండ్రి పై మాటలు చెబుతూ కనిపించారు. ధనుష్‌ తన పనికి అడ్డొచ్చిన వ్యక్తుల్ని కొడుతూ కనిపించారు. ‘వీఐపీ 2’ చిత్రంలో అమలాపాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. కాజోల్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సౌందర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌ థను నిర్మిస్తున్నారు. జులై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Leave your comment