ఎన్టీఆర్.. ఎన్టీఆర్ గా చేయడట!!

తెలుగు - తమిళ్ సినిమా తరతరాలుగా గుర్తుపెట్టుకునే మహానటి సావిత్రి జీవిత కథను ‘మహానటి’ అనే టైటిల్ తో తీస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రి గా కీర్తి సురేశ్ నటిస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటి అంటే సావిత్రి కథ చెప్పాలి అంటే పెద్ద ఎన్టీఆర్ లేకుండా చెప్పలేము. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ సావిత్రి ఒకే టైమ్ లో ఫిల్మ్ కెరియర్ స్టార్ట్ చేసి తెలుగు సినిమా ఎప్పటికీ మరిచిపోలేని సినిమాలు చేశారు. ఆమె కథ చెప్పాలి అంటే మాయబజార్ - మిస్సమ్మ చూపకుండా ఉండలేరు. అవి చెప్పాలి అంటే ఎన్టీఆర్ తప్పకుండా ఉండాలి. పైగా నటించేవాడు గొప్ప నటుడై ఉండాలి. మరి ఇప్పటి తరం వాళ్ళలో అలాంటి ఆనవాలు ఎవరికి ఉన్నాయి.? అవును అందుకే ఈ సినిమాలో ఆ ఎన్టీఆర్ పాత్రను ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వేయాలి.. వేస్తాడు అని టాక్ వచ్చింది. తాత ముఖ పోలికలుతో పుట్టి యంగ్ టైగర్ గా ఎదిగిన తారక్ తాత పాత్రను ఆ సినిమాలో చేస్తాడనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అందిన సమాచారం బట్టి జూనియర్ ఎన్టీఆర్ మహానటి సినిమాలో చేయటం లేదు అని తేలిపోయింది. నందమూరి అభిమానులుకు ఇది పెద్ద నిరాశే కానీ ఏమి చేస్తాం ఇప్పుడు ఎన్టీఆర్ తన రాబోతున్న సినిమా 'జై లవ కుశ'' షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. పైగా ఇందులో మూడు పాత్రలలో నటిస్తున్నాడు. ఇప్పుడు టివి లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ రియాలిటీ షో ని తెలుగులో హోస్ట్ చేస్తున్నాడు. కాబట్టి తాత పాత్రను మనవడు చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ పాత్రను ఎవరు చేయబోతున్నారు అనేది స్పష్టత లేదు.


Leave your comment