10లక్షల డాలర్ల ఫైన్ తో ఇన్ఫోసిస్ సెటిల్ మెంట్

ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కు అమెరికాలో బ్యాడ్ టైం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ఫలితంగా అమెరికాలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసుకోవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో తగు ముందడుగు వేస్తున్న ఇన్ఫీకి ఇటీవలే ఓ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ సంస్థలో దక్షిణాసియాయేతర ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నరాని మాజీ ఉద్యోగి ఒకరు కేసు నమోదు చేశాడు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థలోనే ఇమ్మిగ్రేషన్ అధిపతిగా ఉన్న ఎర్విన్ గ్రీన్ ఈ కేసును ఫైల్ చేశాడు. ఈ కేసును నుంచి తేరుకునే లోగానే న్యూయార్క్లో మరో కోర్టులో సెటిల్ మెంట్ చేసుకోవాల్సి వచ్చింది. వీసా పన్నుకు సంబంధించిన పేపర్ వర్క్ లో లోపాలు ఉన్నట్లు ఇన్ఫోసిస్ సంస్థపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై న్యూయార్క్ కోర్టులో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో వాదనలు హాజరైన ఇన్ఫీ సంస్థ ప్రతినిధి వీసా కేసులో తమ సంస్థ ఎటువంటి తప్పు చేయలేదని తెలిపారు. దీంతో న్యూయార్క్ కు చెందిన వీసా కేసులో సుమారు పది లక్షల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో వీసా కేసును మూసివేస్తున్నట్లు న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షిండర్మాన్ తెలిపారు. కేసును రద్దు చేసేందుకు పది లక్షల డాలర్ల సెటిల్మెంట్ కుదిరిందని ఆయన ప్రకటించారు. రెండు పార్టీల మధ్య 2013 ప్రకారమే ఒప్పందం కుదిరిందని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో పేర్కొంది.


Leave your comment