సభ్యసమాజానికి స్ట్రాంగ్ మెసేజ్

ను చెప్పదలుచుకున్న మాటలను ఖరాఖండీగా చెప్పేయడంలో అల్లు అర్జున్ ఏమాత్రం వెనుకాడడు. అలానే 'చెప్పను బ్రదర్' వివాదాన్ని కొని తెచ్చుకున్న స్టైలిష్ స్టార్.. ఇప్పుడు మరోసారి గట్టి మాటే అన్నాడు. ప్రత్యేకించి ఓ గ్రూప్ ను కాకుండా.. ఈసారి అందరికీ కలిపే ఈ మాట అన్నాడు. ఘంటా రవి హీరోగా నటించిన జయదేవ్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో పాటు అల్లు అర్జున్ కూడా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే.. ఈ ప్రాంగణంలోకి బన్నీ అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడి జనం అంతా.. డీజే డీజే అనే అరుపులతో హోరెత్తించేశారు. ఎవరు మాట్లాడినా డీజే నామ జపమే వినిపించింది. తన వంతు వచ్చే వరకూ ఓపిక పట్టిన బన్నీ.. తన చేతికి మైక్ వచ్చిన తర్వాత మాత్రం.. సున్నితంగానే సభ్య సమాజానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.


Leave your comment