గేల్‌ ఛాలెంజ్‌ని స్వీకరించిన సన్నీలియోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: విండీస్‌ వీరుడు క్రిస్‌గేల్‌ విసిరిన ఛాలెంజ్‌ని బాలీవుడ్‌ నటి సన్నీ లియోనీ స్వీకరించింది. ‘లైలా మై లాలా....’ పాటకు క్రిస్‌గేల్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. ఐస్‌ బకెట్‌, రైస్‌ బకెట్‌లా ‘క్రిస్‌గేల్‌ డ్యాన్స్‌ ఛాలెంజ్‌’ విసిరాడు గేల్‌. ‘రయీస్‌’ చిత్రంలో సన్నీలియోనీ నటించిన ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన గేల్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అచ్చం తనలాగే నృత్యం చేసి మరపించే విజేతకు 5000 డాలర్లు నగదుబహుమతి ప్రకటించాడు. దాంతో ‘ఈ ఛాలెంజ్‌కు నేను సిద్ధమే’ అంటూ సన్నీలియోనీ తను డ్యాన్స్‌ చేసిన వీడియోను, గేల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోను జత చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘క్రిస్‌గేల్‌ డ్యాన్స్‌ ఛాలెంజ్‌కు ఇదే నా ఎంట్రీ’ అని ట్వీట్‌ చేసింది. మరి దీనికి క్రిస్‌గేల్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.


Leave your comment