దాన్ని ‘బిగ్‌బాస్‌’ బయటపెట్టింది! ...మధుమిత

హైదరాబాద్‌: తన భర్త చాలా ధైర్యవంతుడని, అలాంటిది ఆయన కన్నీరు పెట్టుకోవడం చాలా బాధించిందని నటి మధుమిత అన్నారు. నటుడు శివబాలాజీ, మధుమితను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షోలో పాల్గొన్న వారిలో శివబాలాజీ కూడా ఒకరు. ఈ షోలో ఓ సందర్భంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని మధుమిత సోషల్‌మీడియాలో ద్వారా గుర్తు చేసుకున్నారు. ఓ టాస్క్‌లో భాగంగా సహ కంటెస్టెంట్‌లు చెప్పిన వారి నిజ జీవిత సంఘటనలను విన్న శివబాలాజీ కన్నీరు పెట్టుకోవడం హృదయాన్ని కలచివేసిందని అన్నారు. ఇది తన భర్తలోని అరుదైన కోణమని, దాన్ని ‘బిగ్‌బాస్‌’ షో ఒక్కరోజులో బయటపెట్టిందని చెప్పారు. ఇవాళ శివబాలాజీ పంచుకోబోతోన్న ఆయన కథ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం చూడలేనని మధుమిత తన భర్త శివబాలాజీ ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.


Leave your comment