అబ్బాయిల మొహం చూసి పెళ్లిచేసుకుంటే...

ముంబయి: కృతిసనన్‌, రాజ్‌కుమార్‌ రావ్‌, ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బరైలీ కి బర్ఫీ’. అశ్విన్‌ అయ్యర్‌ దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరైలీలో చిత్రీకరించారు. ఇందులో కృతిసనన్‌ బిట్టి పాత్రలో నటిస్తోంది. సినిమా మొత్తం బిట్టి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇందులో కృతి బరైలీలో పుట్టి పెరిగిన అమ్మాయి కాబట్టి ఆమెను అంతా ‘బరైలీ కి బర్ఫీ’ అని పిలుస్తుంటారు. ట్రైలర్‌లో ఆయుష్మాన్‌.. రాజ్‌కుమార్‌ రావ్‌తో గొడవపడుతూ.. ‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అంటాడు. ఇందుకు రాజ్‌కుమార్‌ స్పందిస్తూ.. ‘అమ్మాయిలంతా అబ్బాయి మొహం చూసి పెళ్లిచేసుకుంటే.. మన హిందుస్థాన్‌లో సగం మందికి పైగా అబ్బాయిలు బ్యాచిలర్లుగా మిగిలిపోతారు’ అన్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఆగస్ట్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Leave your comment