ఫిదా కలెక్షన్స్ చూస్తే ఫిదా కాకతప్పదు..

సినిమా పిల్లర్- వరుణ్ తేజ్.. అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా  బాక్సాఫీస్ ను బద్దలు కొడుతోంది. జూలై 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా 60 కోట్లు రాబట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది దర్శకుడు శేఖర్ కమ్ముల సినీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చెప్పుకోవచ్చు. 
అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు దగ్గర్లో ఈ సినిమా ఉందట. విభిన్న అభిరుచులు కలిగిన అబ్బాయి, అమ్మాయి మధ్య చిగురించే ప్రేమకథగా శేఖర్ కమ్ముల ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలంగాణలోని బాన్సువాడ.. అమెరికా చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఇక సాయి పల్లవి తెలంగాణ యాస మాత్రం అందరిని ఆకట్టుకుంటోందని చెప్పడంలో ఏ మాత్పం అతియోశక్తి లేదు. 


Leave your comment