మహిళా ఎమ్మెల్యే ను బండబూతులు తిట్టిన టిఆర్ఎస్ లీడర్

ఆదిలాబాద్ : టిఆర్ఎస్ మహిళ ఎమ్మెల్యేను బండబూతులు తిట్టిన గులాబీ నేత (వీడియో) అధికార TRS పార్టీ నేతలమధ్య వివాదం చోటు చేసుకుంది. పరస్పరం దూషణలతో నేతలు తెగబడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఈ మధ్యే టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముందే కొట్లాడుకున్నారు. బండ బూతులు తిట్టుకున్నారు.

ఈనెల 10 న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవ ప్రాజెక్టు పనుల శంకుస్థాపనకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోగ్రాం సందర్భంగా జన సమీకరణ కోసం ఆదిలాబాద్ నేతలు మీటింగ్ పెట్టుకున్నారు. అయితే రమేష్ రాథోడ్ వేదిక పైకి రాగానే రేఖా నాయక్ పక్కనే కూర్చున్న ఎంపిపి సీట్లో నుంచి లేచే ప్రయత్నం చేశారు. ఎంపిపి లేెవకుండా రేఖ నాయక్ అడ్డుపడటంతో రాథోడ్ గొడవకు దిగాడు. రేపటినుంచి నియోజకవర్గంలో తిరగనియ్యనని వార్నింగ్ ఇచ్చారు. రాథోడ్ రమేష్ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని, ఆయనతో నాకు ప్రాణ హాని ఉందంటూ ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే రేఖనాయక్ పిర్యాదు చేశారు. మహిళల ఎమ్ ఎల్ ఏ పట్ల ఇలా ప్రవర్తించిన రాథోడ్ రమేష్ ను వెంటనే అరెస్టు చేయాలనీ పోలీస్ స్టేషన్ ముందు అనుచరులతోకలిసి రేఖనాయక్ ఆందోళనకు దిగారు.


Leave your comment