గ‌వర్న‌ర్ మాట‌తో.. బిత్త‌రపోయిన ప్ర‌తిపక్ష‌ నేత‌లు

హైద్రాబాద్ : తెల్ల‌వారు జామున ఐదు గంట‌ల‌కు.. గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన అఖిల‌ప‌క్ష నేతలు.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై  గ‌వ‌ర్న‌ర్ కు నివేదించిన నేత‌లు.. ఇవి టీవిల్లో బ్రేకింగులు వేసి.. గిరా గిరా తిప్పితి ఎలా ఉంటుంది..? ఇదేంటీ.. ఈ పొద్దుగాలే.. భేటీ ఏంటీ..? అని ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు. కాని ఇది నిజం తెలంగాణ‌లో నిజం కాబోతుంది.! అదేంటీ..? అనుకుంటున్నారా..? అవును ఈ మాట చెప్పింది సాక్షాత్తు మ‌న గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ్మ‌న్.  కాస్త వివ‌రాల్లోకి వెలితే..  నేరేళ్ళ ఘ‌ట‌న‌పై సోమ‌వారం అఖిల‌ప‌క్ష నేత‌లు గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన సంద‌ర్భంగా విప‌క్ష నేత‌ల‌తో గ‌వ‌ర్న‌ర్ ఇలా అన్నార‌ట‌. 

" నేను ప్ర‌తిప‌క్షాల‌కు అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని  మీరు మీడియాతో ప‌దే ప‌దే చెబుతు.. బ‌ద్నామ్ చేస్తున్నారు.. ఇక‌ నుండి.. తెల్ల‌వారు జామున ఐదు గంట‌ల‌కే మీకు అప్పాయింట్ ఇస్తా".. అని అన్నార‌ట‌. దీనికి సిఎల్పీ నేత జానారెడ్డి బ‌దులిస్తూ.. నేను ఈ రోజు మూడున్న‌ర‌కే నిద్ర‌లేచా అని అనడంతో.. అదేంటీ ప్ర‌తిరోజు ఇదే టైం కు నిద్ర లేస్తారా..?  అని అడిగార‌ట‌. దీనికి జానారెడ్డి బదులిస్తూ..లేదు .. ఈరోజు ఓ పెళ్లీకి అటెండ్ అవ్వాల్సిఉండి లేచాను అన్నార‌ట‌. దీనికి వెంట‌నే గ‌వ‌ర్న‌ర్.. ఓహో అలానా.. అంటే పెళ్ళికి వెళుతు ఇలా వ‌చ్చార‌న్నమాట అని.. సుతి మెత్త‌గా జానాకు సెటైర్ విసిరార‌ట‌. దీంతో గ‌వ‌ర్న‌ర్ ప‌దునైనా చుర‌కు కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌.. జానాతో స‌హా నేత‌ల అంద‌రు త‌మ ముఖాల‌కు న‌వ్వును అద్దుకున్నార‌ట‌. 

ఇందు మూలంగా ఏతా వాత చెప్పొచ్చేదేమంటే.. గ‌వ‌ర్న‌ర్ నర్సింహ్మ‌న్,  సిఎం కేసీఆర్ కు భ‌జ‌న చేస్తున్నారంటు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌తో  ర‌గిలిపోతున్న గ‌వ‌ర్న‌ర్ .. ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం.. ఇక నుండి తెల్ల‌వారు జామున‌నే విప‌క్షాల‌కు అప్పాయింట్  ఇచ్చిన ఇస్తారేమో.. అని నేత‌లు గుస‌గులాడుకుంటున్నారు.. అదే జ‌రిగితే.. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గానే కాదు.. నర్సింహ్మ‌న్ ఇలా కూడా రికార్డ్ బ్రేక్ చేయ‌డం ఖాయం.
 


Leave your comment