జనంలో ఆమెకు అంతుందా...

సినిమా పిల్లర్- కేరళలోని కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఆవిష్కరణ కోసం వచ్చిన మాజీ పోర్న్ స్టార్.. అందాల భామ సన్నీలియోన్ ని చూసేందుకు జనం విరగబడి వచ్చారు. వచ్చిన జనాన్ని చూసి సన్నీ లియోన్ ఆశ్చర్యపోయింది. వారు చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ఆమె ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పింది. కొచ్చిలోని ఎంజిరోడ్ లో ఫోన్ 4 డిజిటల్ హబ్ ప్రారంభోత్సవానికి ఈ నెరజాన విచ్చేసింది.

 

ఇక సన్నీ రావడం ఆలస్యం అవుతుందని తెలిసినా ఆమె కోసం గంటల తరబడి అభిమానులు ఎదురుచూశారట. అందాల భామ వచ్చాక అభిమానులు అంతా వియ్ లవ్ సన్నీ అంటూ నినాదాలు కూడా చేశారట. ఇందుకు సంబందించిన వీడియోని సన్నీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కేరళ అభిమానులు చూపించిన ప్రేమని నా జీవితంలో మరిచిపోలేను అంటూ సన్నీ తెగ సంబరపడిపోతోంది.


Leave your comment