అలాంటి సన్నివేశాలకు నేను దూరం..

సినిమా పిల్లర్- అందాల భామ సాయి పల్లవికి తెలుగులో చేసిన ఓకే ఒక్క సినిమాతో అంతా ఫిదా అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన  ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ నెరజానకు ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు నాని నటిస్తున్న ఎంసిఏ లో నటిస్తుంది.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చాలా అంశాలు చెప్పుకొచ్చింది. గ్లామర్ కోసం స్కిన్ షో చేయడం తనకు ఇష్టం ఉండదని చెప్పింది. అంతేకాక సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించనని వాటికి తానూ వ్యతిరేఖం అని స్పష్టం చేసింది. సినిమాలోకి రావాలనే నా నిర్ణయాన్ని నా తల్లితండ్రులు గౌరవించారు. వారిని ఇబ్బంది పెట్టే పనులు చేయదలుచుకోలేదని తన అభిప్రాయాన్ని చెప్పిందీ భామ.
ఐతే గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో సాయి పల్లవి మాదిరినే గ్లామర్ షోకు దూరమని, రొమాంటిక్ సీన్లలో నటించమని చెప్పినవాళ్లే. కానీ అవకాశాలు పెరిగిన తరువాత ఆ నియమాల్ని పక్కన పెట్టినవారు చాలా మంది ఉన్నారు. అందరిలాగే సాయి పల్లవి సైతం మారిపోతుందా... లేక చెప్పిన దానికే కట్టుబడుతుందా అన్నది ముందు ముందు చూడాలి.


Leave your comment