దటీజ్ కామ్రేడ్.. ఈ మేయర్ కు సలాం కొట్టాల్సిందే..

ఈ కాలంలో రిక్షాలెక్కి ఎవరు వెళ్తున్నారు. కొద్ధి పాటి సంపాదన ఉంటే చాలు.. మినిమమ్ బైక్ లు కొనుక్కుంటున్నారు. అదే రాజకీయ నాయకుడైతే కారు లేనిదే వారి స్టేటస్ కు తగ్గట్లు లేదని ఫీల్ అయ్యే రోజులివి. మరి గల్లీ లీడర్లే కార్లలో తిరుగుతుంటే మరి మేయర్ లు.. విలువైన కార్ల కాన్వాయ్.. దానికి తగ్గట్లు మంది మార్బలం చూపించాల్సిందే. కానీ ఫొటోలో కనిపిస్తున్న మేయర్ సింప్లీ సిటీకి ఆదర్షంగా నిలుస్తున్నాడు.

 

రిక్షాలో కూర్చొన్న వ్యక్తీ డాక్టర్ సిన్హా . వీరు త్రిపుర రాజధాని అగర్తల నగరానికి మేయర్. ఈయనకు సొంత కారు,మోటార్ సైకిల్ , మరియు సొంత ఇల్లు కూడా లేదు. ఆఫీసుకు రిక్షాలోనే వెళ్ళటం అలవాటుగా చేసుకున్నాడు. ప్రభుత్వపు వాహనాలను అసలు వినియోగించరు. ప్రస్తుతం ఒక వార్డు సభ్యుడు కూడా విలసవంతమైన కారులోనే తిరుగుతుంటారు. ఈయన కమ్యూనిస్టు పార్టీ కి చెందిన సీనియర్ నేత.


Leave your comment