క‌మ‌లం వైపు ఈటెల చూపు ..?

హైద‌రాబాద్ : గులాబీ పార్టీలో అసంతృప్తి సెగ‌లు నిగురు గ‌ప్పిన నిప్పులా ఉన్నాయా .. ? అడుగ‌డుగునా త‌మ‌కు జ‌రుగుతున్న అవ‌మాల‌తో కొంద‌రు మంత్రులు ర‌గిలిపోతున్నారా ..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తుంది టిఆర్ఎస్ లోని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి. ప్ర‌తి అంశంలోనూ కేసిఆర్ కుటుంబానిదే ఆదిప‌థ్యం కొన‌సాగుతుండ‌టంతో మంత్రులు డ‌మ్మీలుగా మిగిలిపోతున్నామ‌నే ఆవేద‌న‌లో ఆమాత్యులు ఉన్నార‌ని తెలుస్తోంది. ఇందులో ప్ర‌త్యేకించి ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ కేసిఆర్ వ్య‌వ‌హార‌శైలిపై చిర్రుబుర్రులాడుతున్నార‌ని తెలుస్తోంది. ఈటెల‌కు అడుగ‌డుగునా జ‌రుగుతున్న అవ‌మానాల‌తో పూర్తిగా అస‌హ‌నంగా ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

 

ఆర్థిక‌మంత్రిగా ఉన్న ఈటెల‌కు బ‌డ్జెట్ కూర్పు స‌మ‌యంలో కేసిఆర్ పూర్తిగా ప‌క్క‌న పెట్టార‌ని .. అయినా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రుగుతున్న ఆర్థిక‌శాఖ ఉన్న‌తాధికారుల స‌మావేశానికి వెళ్ళిన ఆయ‌న‌ను అనుమ‌తి లేద‌ని సీఎం భ‌ద్రాతా సిబ్బంది గేటు బ‌య‌ట నుంచే తిప్పి పంపార‌ట‌. త‌న స్వంత శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారుల స‌మావేశానికి త‌న‌నే అనుమ‌తించ‌క‌పోవ‌డాన్ని ఈటెల రాజేంద‌ర్ జీర్ణించుకోలేక‌పోయార‌ట‌. ఇది కేవ‌లం ఒక ఉద‌హ‌ర‌ణ మాత్ర‌మేన‌ని .. ఇలాంటివి అడుగడుగునా ఎన్నో ఉన్నాయ‌ని ఈటెల స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక ఇటివ‌ల డిల్లీలో జ‌రిగిన జీఎస్టీ స‌మావేశానికి త‌న‌ను ప‌క్క‌న పెట్టి మంత్రి కేటిఆర్ ను పంప‌డం కూడా మ‌రో అవ‌మానంగా ఆయ‌న ఫీల్ అవుతున్నార‌ని తెలుస్తోంది.

 

అయితే ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న కేంద్ర బిజెపి నాయ‌క‌త్వం ఆయ‌న‌కు ట‌చ్ లోకి వెళ్ళింద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. టిఆర్ఎస్ లో ఇప్ప‌టికే దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేల‌ను న‌లుగురు ఎంపీల‌తో ట‌చ్ లోకి వెళ్ళింద‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్ లో హాట్ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. టిఆర్ఎస్ వ‌ర్గాలు సైతం దీనిని ఆఫ్ ద రికార్డ్  దృవీక‌రిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఈటెల కూడా ఉన్నార‌ని చ‌ర్చ బ‌లంగా ఉంది. ఆత్మాభిమానాన్ని చంపుకొని టిఆర్ఎస్ లో ఉండే కంటే .. త‌న‌దారి తాను చూసుకోవ‌డం మంచిద‌ని భావ‌న‌లో ఈటెల ఉన్నార‌ని ఆయ‌న స‌న్నిహితుల మాట‌. మ‌రి బిజేపి ఆఫ‌ర్ ప్యాకేజీకి ఈటెల ఇప్ప‌టికిప్పుడు ప‌చ్చ జెండా ఊపుతారా .. లేక మ‌రి కొంత స‌మ‌యం వేచిచూస్తారా అనే చ‌ర్చ  తెలంగాణ రాజ‌కీయాల్లో హీట్ రాజేస్తోంది.


Leave your comment