వైఎస్ జ‌గ‌న్ ఎందుకు మ‌తం మారుతున్నారు..!

హైదరాబాద్ : వైఎస్ జ‌గ‌న్ ను సెంటిమెంట్ వెంటాడుతుందా..? పాలిటిక్స్ లో మొండోడిగా పేరున్న‌జ‌గ‌న్ .. ఇప్పుడు ఆ సెంటిమెంట్ కు వ‌ణికిపోతున్నాడా..? త‌న క‌ల నిజం కావాలంటే ఆ సెంటిమెంట్ ను ఫాలో కావాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారా..? అవును నిజ‌మే అంటున్నారు వైసీపీ త‌మ్ముళ్లు. ఇంత‌కు ఏమిటా సెంటిమెంట్ అనే క‌దా..! మీ ప్ర‌శ్న‌. అయితే కాస్త ఇది చ‌దివితే మీకే అర్థం అవుతుంది.

 

త‌న తండ్రి వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అంద‌రు వ‌ద్దు వ‌ద్దుంటున్నా.. పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ కు జ‌నంలో విప‌రీత‌మైన క్రెజీ ఉన్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ పై ఉన్న అభిమాన‌మో.. లేక జ‌గ‌న్ మొండిత‌నం మీద‌ ఉన్న ప్రేమ‌నో తెలియ‌దు కాని.. జ‌గ‌న్ ఎక్క‌డికి వెళ్ళినా సినిమా హీరోను మించిన క్రేజీ జ‌గ‌న్ సొంతం. అంతేకాదు.. వేల కో్ట్ల‌ అవినీతి కేసులో రెండె్ళ్లు జైల్లోకాపురం చేసినా జ‌నంలో ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రి ఇంత క్రేజి మాస్ పుల్ల‌ర్ గా ఉండి.. దీనికి తోడు త‌న తండ్రి వేసిన బ‌ల‌మైన రాజ‌కీయ పునాదులు ఉండి.. వీటికి తోడు కో్ట్లు రూపాయ‌లు  పుష్క‌లంగా ఉన్నాకూడా.. 2014లో జ‌గ‌న్ ఎందుకు ఓడిపోయారు. ఇదే జ‌గ‌న్ నేకాదు.. ఆయ‌న రాజ‌కీయ వ్వ‌తిరేకుల‌కు కూడా అర్థం కావ‌డంలేద‌ట‌.

అయితే దీనిపై ఇప్ప‌డిప్పుడే జగ‌న్ కు క్లారిటీ వ‌చ్చింద‌ట‌. అదే మ‌తం. అదేంటీ మ‌తం ఏంట‌నే క‌దా మీ అనుమానం. అవును జ‌గ‌న్.,  రెడ్డి అయిన‌ప్ప‌డికి.. ఆయ‌న క్రిష్టియ‌న్ మ‌త‌స్థుడు. జ‌గ‌న్ తాతా అయిన వైఎస్ రాజారెడ్డి క్రిష్టియ‌న్ మ‌తం స్విక‌రించిన త‌ర్వాత‌.. ఇక అప్ప‌డి నుండి వైఎస్ ప్యామిలీ అంతా క్రిష్టియ‌న్ మ‌తాన్నితూ చా త‌ప్ప‌కుండా ఆచ‌రిస్తు వ‌స్తున్నారు. అది ఎంత‌లా అంటే వారు నిత్యం  ప్ర‌భువు ధ్యానంతో త‌రిస్తుంటారు. దీనిలో భాగంగా  వైఎస్ జ‌గ‌న్  ప్ర‌తి ఏడాది ఏసు క్రీస్తు జ‌న్మ‌స్థ‌లం జేరుస‌లేంకు వెళుతు..క్రిషియ‌న్ మ‌తాన్నిఫాలో అవుతుంటారు. అయితే ఇదే  జ‌గ‌న్ కు సిఎం కుర్చీని దూరం చేసింద‌న్న‌దని చ‌ర్చ పార్టీలో జ‌రుగుతుంది. 

 

జ‌గ‌న్ కు ఈ మ‌ధ్య  ఓ పెద్దాయ‌న మ‌తం మారాల‌ని చెప్పార‌ట‌. అది ఎంత‌లా అంటే ఆయ‌న చెప్పిన లాజిక్స్ , జ‌రిగిన అనుభ‌వాలను  విని.. జ‌గ‌న్ సైతం  అంగీక‌రించార‌ట‌. తాను క్రిష్టియ‌న్ మ‌తంలో ఉండ‌టం.. ఆ మ‌తాచారాల‌ను పాటిస్తుండ‌టంతో .. మేజారిటి హిందువుల‌కు క‌నెక్ట్ కాలేక‌పోయాన‌ని జగ‌న్ భావిస్తున్నార‌ట‌. అంతేకాదు త‌న తండ్రి వైఎస్ సైతం దైవ‌భ‌క్తిని పెంచుకున్న‌త‌ర్వాత‌నే రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చింద‌ని న‌మ్మిన జ‌గన్.. ఇక హిందూ మ‌తంలోకి మారితేనే సిఎం కుర్చీ ద‌క్కుతుంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. దీనిలో భాగంగానే.. ఈ జ‌గ‌న్ మొన్నామ‌ధ్య చిన‌జీయ‌ర్ స్వామి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నార‌ని టాక్. ఇక పూర్తి స్తాయిలో హిందూ మ‌తాన్ని స్వీక‌రించాల‌ని .. ఇప్ప‌డికే దీనిపై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా చెప్పి ఒప్పించార‌ని ప్ర‌చారం సాగుతుంది. సో.. అంత కుదిరితే.. ఓ మంచి ముహూర్థం రోజున వైఎస్ జ‌గ‌న్ హిందూ మ‌తంలోకి మారుతారట‌. 


Leave your comment