లిప్ లాక్ ముద్దులు వద్దంటున్న హనుమంతన్న

హైదరాబాద్ : సినిమాల్లో ముద్దు సీన్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వీఎచ్ గరం అవుతున్నడు. యువత చెడిపోనీకే సినిమాల్లో ముద్దు సీన్లే నని ఖరాఖండిగా చెపుతున్నారు. పెళ్లి చూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లపైన వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ ముందు అర్జున్ రెడ్డి సినిమా యాడ్ ఉన్న బస్సు కనిపించగానే హనుమంతన్న ఊగిపోయారు. బస్సును ఆపి హీరో దేవరకొండ విజయ్.. హీరోయిన్ శాలిని పాండే లిప్ లాక్ ముద్దు సీన్ ఉన్న పోస్టర్ ను చించేశాడు.ఆర్టీసీ డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాయ.. అర్జునరెడ్డి సినిమా పోస్టర్ యువతను పూర్తిగా చెడగొట్టే విదంగా ఉందన్నారూ వీహెచ్.యువత ఇప్పటికే సినిమాలు చూసి చెడిపోతున్నాయని భావిస్తుంటే ఇలాంటి పోస్టర్లతో ఇంకా ఏమి చెప్ప దలుచుకున్నారని ప్రశ్నించారు.


Leave your comment