కేసిఆర్ అభ‌ద్ర‌త‌లో ఉన్నారా ..?

హైద‌రాబాద్ : తెలంగాణ సీఎం కేసిఆర్ అభ‌ద్ర‌త‌లో ఉన్నారా ..? గులాబీ పార్టీ వ్య‌వ‌హారాల్లోకి తొంగిచూస్తే అవును అది నిజ‌మే అనిపిస్తుంది. రాబో 2019 ఎన్నిక‌ల్లో మ‌ళ్ళీ అధికారం త‌మ‌దేన‌ని ప‌దే ప‌దే చెబుతున్న గులాబీ బాస్ .. లోలోప‌ల మాత్రం కొంత అభ‌ద్రాతా భావంలో ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది. పార్టీలో నేత‌ల మ‌ద్య స‌మ‌న్వ‌య లోపాలు త‌న కొంప ఎక్క‌డ ముంచుతాయోన‌న్న బెంగ ఆయ‌న్ను వెంటాడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకునేందుకు న‌డుం బిగించిన‌ట్లు క‌నిపిస్తుంది.

 

ఇక వివ‌రాల్లోకి వెళితే .. వ‌చ్చేఎన్నిక‌ల్లో మ‌న‌కు తిరుగు లేదు. మ‌ళ్లీ అధికారం మ‌న‌దే .. అయినా స‌రే మ‌నం వాస్త‌వాల‌కు దూరంగా వెళ్ళొద్దు .. పార్టీ .. మ‌రియు ప్ర‌భుత్వ ప‌రంగా లోటు పాట్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండండీ. జిల్లాల వారిగా ప‌రిస్థితుల‌ను స‌మీక్షించండీ లోటుపాట్ల‌ను స‌రిదిద్దండీ ఇది సీఎం కేసిఆర్ పార్టీ నేత‌ల‌కు చేస్తున్న దిశానిర్దేశం. జిల్లాల వారిగా మేధోమ‌ధ‌నం చేప‌ట్టండీ .. వాస్త‌వాల‌ను గ్ర‌హించండి .. అని కేసిఆర్ ముఖ్య‌నేత‌ల‌కు సూచిస్తున్నార‌ట‌. పార్టీలో నేత‌ల మ‌ద్య స‌మ‌న్వ‌య లోపాల‌కు చెక్ పెట్టేందుకు కేసిఆర్ వారి మ‌ద్య స‌ర్దుబాటు చేసేలా సీనియ‌ర్ మంత్రుల‌ను రంగంలోకి దింపార‌ట‌. ఇ్దులో భాగ్గా జిల్లాల వారిగా పార్టీ ప‌రిస్థితుల‌పై మేధోమ‌ధ‌నం చేస్తున్నారు సీనియ‌ర్ మంత్రులు.

 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేద‌ని చెబుతున్నా .. అక్క‌డ‌క్క‌డా ఉన్న లోటుపాట్ల‌ను స‌రిదిద్దుకోక‌పోతే న‌ష్ట‌పోతామ‌నే భావ‌న సీఎం కేసిఆర్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జిల్లాల వారిగా నేత‌ల మ‌ద్య నెల‌కొన్న స‌మ‌న్వ‌లోపాలు పార్టీ పుట్టి ముంచ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని గులాబీ బాస్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేధోమ‌ధ‌నంలో సీనియ‌ర్ మంత్రులు .. జిల్లాల వారిగా పార్టీ వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి .. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరు ఎలా ఉంది .. ప‌థ‌కాల అమ‌లు తీరుపై జ‌నం మ‌న‌స్సులోని మాట‌లేమిటీ ఇలా వాస్త‌వ ప‌రిస్థితులను తెలుసుకునే దిశ‌గా  పూర్తిస్థాయి మేధోమ‌ధ‌నం జ‌రుపుతున్నారు  సీనియ‌ర్ మంత్రులు . మొత్తానికి అధికారం మ‌ళ్ళీ మ‌న‌దేన‌ని చెబుతున్నా .. వాస్త‌వాల‌కు దూరంగా వెళితే జ‌నం క‌ర్రు కాల్చి వాత పెడుతార‌నే భ‌యం గులాబీ బాస్ లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


Leave your comment