రామేశ్వ‌ర్ రావు చేతుల్లోకి ఆర్టీసీ ..?

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్ర‌వేటు ప‌రం కాబోతోందా ..? న‌ష్టాల బారిన ప‌డిన ఆర్టీసీని గ‌ట్టెక్కించాలంటే ప్ర‌వేటు ప‌రం చేయ‌డ‌మే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వం భావిస్తోందా ..? అంటే అవున‌నే అంటున్నాయి జ‌రుగుతున్న ప‌రిణామాలు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మైహోం రామేశ్వ‌ర్ కు ఆర్టీసిని అప్ప‌గించేందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ ఇప్ప‌టికే రెండు వేల కోట్ల వ‌ర‌కు అప్పుల్లో కూరుకు పోయింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఆర్టీసీకి యాబైవేల‌కు పైగా ఆస్తులు ఉన్న‌ప్ప‌టికీ .. అవ‌న్నీ  వివిధ బ్యాంకుల్లో త‌న‌ఖా పెట్టి ఉన్నాయి.


ఆర్టీసీని గ‌ట్టెక్కించేందుకు ప్ర‌భుత్వం ఏ కోశానా ప్ర‌య‌త్నించ‌డం లేదు. లోపాల‌ను గుర్తించి సంస్థ‌ను చ‌క్క‌బెట్టాల్సిన స‌ర్కారు ఆదిశ‌గా క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టంలేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వ ప‌రంగా సంస్థ‌కు చెల్లించాల్సిన డ‌బ్బుల విష‌యంలోనూ స‌ర్కారు పెద్ద‌లు నాన్చుడు ధోర‌ణి అవ‌లంభించ‌డం దారుణ‌మ‌ని కార్మికులు వాపోతున్నారు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సంస్థ‌ను లాభాల బాట‌లో న‌డిపించాల‌న్నా .. ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాల‌ను ప‌రుగులు తీయించాల‌న్నా ప్ర‌వేటు ప‌రం చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు న‌మ్ముతున్నారు. అందుకే బ‌డా పారిశ్రామిక వేత్త‌య్యిన రామేశ్వ‌ర్ రావు చేతుల్లో ఆర్టీసీని పెట్టాల‌ని కేసిఆర్ యోచిస్తున్నార‌ట‌. సీఎం కేసిఆర్ కు అత్యంత స‌న్నిహితుడుగా పేరున్న రామేశ్వ‌ర్ రావు కూడా ఈ ప్ర‌తిపాద‌న‌కు సానుకూలంగా ఉన్నార‌ని స‌మాచారం. 


మ‌రి ఇదే జ‌రిగితే సంస్థ‌లో పని చేస్తున్న కార్మికులు ప్ర‌భుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంది. త‌న క‌నుస‌న్న‌ల్లో ఉండే ఆర్టీసీ కార్మిక సంఘం నాయ‌కుల‌ను ఒప్పించినా .. మ‌రి ఇంత మంది కార్మికుల‌ను ఎలా ఒప్పిస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నే. అయితే ప్ర‌స్తుతం తెలంగాన‌లో కేసిఆర్ నిర్ణ‌యాల‌కు తిరుగులేద‌ని ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాల‌ను ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా దాన్నుంచి వెన‌క్కి త‌గ్గిన సంద‌ర్బాలు త‌క్కువ‌ని .. మ‌రి ఆర్టీసీ విష‌యంలో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతో చూడాల‌ని పొలిటిక‌ల్ విశ్లేష‌కులు అంటున్నారు. ఒక వేళ కేసిఆర్ ఆర్టీసీని రామేశ్వ‌ర్ రావుకు అప్ప‌గిస్తే క‌నుక అది ఓ పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుందంటున్నారు.


Leave your comment