గులాబీ ఎమ్మెల్యేల‌పై నిఘా ..!

హైద‌రాబాద్ : గులాబీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ నిఘా పెంచారు. వారి పనితీరు .. ప్రజల్లో వారికున్న పేరు .. వారి వ్యవహరాలన్నింటిపై కన్నేసే విధంగా ప్ర‌త్యేక ఇంటిలిజెన్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసారు. వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల మీద కేసీఆర్ ఇప్పటికే పలు ధపాలు సర్వేలు నిర్వహించిన విష‌యం తెలిసిందే . సర్వేల్లో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు కూడా . అయినా చాలా మంది ఎమ్మెల్యేలో మార్పు రాలేదు. పైగా చాలా మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు పెరిగాయి. చాలా నియోజకవర్గాల్లో అంతర్గత పోరు అధికమయ్యింది. లీడర్ .. కాడర్ మద్య కీచు లాటలు పెరిగాయి. ఎమ్మెల్యే .. ఎంపీల మద్య గ్యాప్ కూడా పెరిగింది. ఇదంతా  పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ప్రభావం చూపుతోంద‌ని కేసిఆర్ భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించేందుకు ప్ర‌త్యేక పోలీసులతో షాడో టీం లను ఏర్పాటు చేసారు.


పార్టీ  ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు .. ఏలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విషయాలను ఎప్పటి కప్పుడు ఇంటలిజెన్స్ పోలీసులు ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంటారు. ప్రాథమికంగా ప్రజల నుంచి సమాచారం సేకరించకుండా..అధికారిక కార్యక్రమాలనే కవర్ చేస్తూ ఉంటారు. ప్రధానంగా సెకండరీ సోర్స్ లనే నమ్ముకుని పనిచేస్తారు. అయితే ఇప్పడు సీఎం ఏర్పాటు చేసిన షాడో టీంలు కేవలం ఎమ్మెల్యేలను ఫాలో చేయడానికే పరిమితం కాకుండా...ప్రజలతో మమేకమవుతూ ఎమ్మెల్యేల పని తీరుపై సమాచారాన్ని సేకరిస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హమీలను ఎంత మేర నేరవేరుస్తున్నారు, ఆయన పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, ఎమ్మెల్యేల పాసిటివ్స్ ఏంటీ, నెగెటీవ్స్ ఏంటీ అన్న అంశాలను క్రోడికరించి నివేదికలు రూపొందించే భాద్యతలను ఈ షాడో టీంలకు అప్పజెప్పారు. దీంతో పాటు నియోజవర్గాల్లో పార్టీల బలబలాలు ఏలా ఉన్నాయి, మండలాల వారిగా గెలుపోటములను ప్రభావితం చేసే వ్యక్తుల సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ నివేదికలకకు అనుగుణంగా గెలిచే అభ్యర్ధులకు వచ్చే ఎన్నికల్లో పెద్ద పీఠ వేయాలన్న ఆలోచనలో కేసిఆర్ ఉన్నారు. అందుకే ఎన్నికలకు 20 నెలల సమయమున్నా..ఎమ్మేల్యే పనితీరు, నియోజకవర్గాల వారిగా పార్టీల బలా బలాలను నివేదించేందుకు షాడో టీంల ద్వ‌రా సేక‌రిస్తున్నారు గులాబీ బాస్. 


ఈ షాడో టీంలను డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అవసరాన్ని బట్టి సీఐలు, ఎస్సై కాడర్ అధికారులు ఉండేలా డీఎస్పీలకు అనుమతులిచ్చారు. ఇప్పటికే ఈ టీంలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యేల్లో గుబులు పెరిగింది. ఓ వైపు సీఎం సర్వేలు .. మరో వైపు షాడో టీంల సమాచార సేకరణతో నియోజకవర్గాలనే పట్టుకు వేలాడుతున్నారు. నియోజకవర్గ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. షాడో టీంలు ఏవరిని కలిసి ఏం అడుగుతారో అన్న భయంతో అందరితో ఎమ్మెల్యేలు మంచిగా ఉండేలా చొరవ చూయిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Leave your comment