అందుకోసం ఆమెకు నాలుగు కోట్లా...

సినిమా పిల్లర్- రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత నటిస్తున్న మూవి సాహో. ఇక ఈ సినిమాలో ఎవరున్నా లేకున్నా నాయిక ఉండాల్సిందే. ఆ లోటును తీర్చింది బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధా కపూర్‌. తనకున్న బాలీవుడ్‌ సినిమాల ఒప్పందాలు వాయిదా వేసుకుని మరీ ప్రభాస్‌ సినిమాకు అంగీకరించిందట ఈ నెరజాన. ఐతే ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పైనే ఆమె డిమాండ్‌ చేసిందట. ఐనప్పటికీ శ్రద్దా కపూర్ అడిగిన భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు. 
ప్రభాస్ సినిమా చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం కాకూడదనే శ్రద్ధా అడిగినంతా ఇచ్చారని తెలుస్తోంది. చివరి నిమిషంలో అడిగారు కాబట్టి…నాయిక సంతృప్తికరంగానే తీసుకుంది. ఇక ‘సాహో’ చిత్రీకరణ కొన్నాళ్ల కిందటే ప్రారంభమైంది. విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తో దర్శకుడు సుజిత్‌ కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించారు. ఇక తాజాగా ప్రభాస్‌ చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టాడు. నాలుగున్నరేళ్ల తర్వాత ఓ కొత్త సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఇంతకీ ప్రభాస్‌ శ్రద్ధా కపూర్‌ జోడీ ‘సాహో’ కు కొత్తదనాన్ని తీసుకుస్తుందా అన్నదే అభిమానుల ఆసక్తి.


Leave your comment