పవర్ స్టార్ ను అంతలా అవమానించాడా..

సినిమా పిల్లర్- ఎప్పుడు వివాదాల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఈ సారి పవన్ కళ్యాణ్ పై పడ్డాడు. పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు వర్మ . అసలు పవర్ స్టార్ అనే బిరుదు విజయ్ దేవరకొండ కు ఇవ్వాలని.. పవన్ కళ్యాణ్ కంటే పది రేట్లు విజయ్ బెటరని అంటున్నాడు రాంగోపాల్ వర్మ. అంతే కాదు నటనలో పవన్ కంటే విజయ్ దేవరకొండ 20 రేట్లు మెరుగు అని అందుకే రియల్ పవర్ స్టార్ అనే బిరుదు  విజయ్ దేవరకొండ కు ఇవ్వాలని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు వర్మ .
ఇక గత కొంతకాలంగా రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని అదేపనిగా టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురౌతూ వస్తున్నాడు . రాంగోపాల్ వర్మ మరో హీరోని పొగిడితే తప్పు లేదు కానీ అదే సమయంలో  పవన్ కళ్యాణ్ ని ఇందులో విమర్శించడం మరీ దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ అభిమానులు . మరి రాంగోపాల్ వర్మ మామూలుగానే విజయ్ దేవరకొండను పొగిడాడా... లేక పవన్ ను విమర్శించడానికే ఇలా చేశాడా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.


Leave your comment