టిఆర్ఎస్ ల‌ఫంగ‌ల‌కు భూముల వివ‌రాలు ఇవ్వొద్దంటున్న రేవంత్ రెడ్డి..!

హైద‌రాబాద్ : కేసిఆర్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌మ‌గ్ర భూస‌ర్వేపై నిప్పులు చెరిగారు టిడిపి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఈ భూస‌ర్వే కోసం ఏర్పాటు చేస్తున్న రైతు స‌మితులు రైతుల‌ను పీల్చుకు తినేందుకు త‌ప్పా దేనికి ప‌నికిరావ‌ని ద్వ‌జ‌మెత్తారు. టిఆర్ఎస్ లో ప‌నిపాట లేని ల‌ఫంగ గాళ్ళ‌నంతా ఈ రైతు స‌మితుల్లో వేస్తున్నార‌ని ..  రైతు స‌మితుల పేరుతో  కేసిఆర్ త‌యారు చేస్తున్న న‌యా ర‌జాక‌ర్ల సైన్య‌మ‌న్నారు. కేసిఆర్ నియ‌మిస్తున్న ఈ ల‌ఫంగ‌ల చుట్టూ రైతులు తిర‌గాలా అంటూ ప్ర‌శ్నించారు రేవంత్ . ముఖ్య‌మంత్రి కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యం .. రెవెన్యూ శాఖ‌ను నిర్విర్యం చేసి టిఆర్ఎస్ నేత‌ల‌ను క్రియాశీలం చేయ‌డం త‌ప్పా మ‌రొక‌టి కాద‌న్నారు. ఈ రైతు స‌మితులు రైతుల నుంచి మామూళ్ళు వ‌సూలు చేయ‌డానికేన‌న్న రేవంత్ .. ఇలాంటి చెత్త నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్న కేసిఆర్ కు .. రైతులు త‌గిన బుద్ది చెప్పే స‌మ‌యం ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. రైతులెవ‌రూ టిఆర్ఎస్ ల‌ఫంగ గాళ్ళ‌కు త‌మ భూముల వివ‌రాలు ఇవ్వొద్ద‌ని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


రాష్ట్రంలో సమస్యలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి సీఎం కేసిఆర్ కొత్త నాటకానికి తెర లేపారని విమ‌ర్శించిన రేవంత్ .. కేసిఆర్ కు సంఖ్యా శాస్త్రం పిచ్చి ముదిరిందన్నారు.గ‌తంలో కేసిఆర్ హ‌డావిడిగా చేప‌ట్టిన మన ఊరు మన ప్రణాళిక ఎటుబోయింద‌న్న ఆయ‌న .. 3 సంవత్సరాలు గడుస్తున్నా దిక్కు మొక్కు లేద‌న్నారు. ఇక ఈ కోవ‌లో చేప‌ట్టిన .. సమగ్ర కుటుంబ సర్వే ప్రజలను భయబ్రాంతుల‌కు గురిచేసిన విష‌యాన్ని రేవంత్ గుర్తు చేశారు. గ్రామ జ్యోతి పథకంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామ‌ని  గొప్పలు చెప్పిన కేసిఆర్ స‌ర్కారు ..  పంచాయతీలకు కనీస నిధులు కూడా ఇవ్వకుండా కాలం వెళ్ళ‌దీస్తున్న విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని చెప్పారు. ఇక కేసిఆర్ క్యాబినెట్ మంత్రులంతా చెప్రాసిలుగా మారార‌ని కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి .. వెంట‌నే జీవో నెంబ‌ర్ 39 ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇక తాను మాట్లాడిన విష‌యాల్లో ఏమైనా త‌ప్పులుంటే కేసులు వేసుకోవ‌చ్చిన రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి స‌వాల్ విసిరారు. మ‌రి గులాబీ బాస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ స‌వాల్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Leave your comment