ఆయనతో ఫోన్ లోనే మాట్లాడా.. కానీ త్వరలో..

సినిమా పిల్లర్- బాహుబలి బంపర్ హిట్ తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా సాహో. ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ శ్రద్దాకాపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తెలుగులో నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో కలసి నటించడం గురించి శ్రద్దా స్పందించింది. ప్రభాస్ తో ఫోన్ లో మాట్లాడాను....ఆయన్ను త్వరలోనే కలుస్తాను అని చెప్పింది.
అంతే కాదు ప్రభాస్ అల్ ఇండియా స్టార్ అని.. సాహో లో తన పాత్ర కోసం తెలుగు నేర్చుకుంటున్నని చెప్పుకొచ్చింది. ఇక ప్రభాస్ తో నటించడం నాకు చాలా ఉత్సుకతగా ఉందని.. ఇది నా తోలి బహుభాషా చిత్రం అని చెప్పింది. సాహోలో నాది అద్భుతమైన పాత్ర, గొప్ప కథ.. ఇది సవాలుతో కూడుకున్నది ... ఒకే సన్నివేశాన్ని రెండు విభిన్న భాషల్లో చేయాలి... అందుకే తెలుగు భాషపై శిక్షణ తీసుకుంటున్నా అందీ నెరజాన. మరి ప్రభాస్.. శ్రధ్దా జోడి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.


Leave your comment