modi-manu-bhakar

పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన మను భాకర్

మను భాకర్ ను చూసి దేశం గర్వపడుతోంది -ప్రధాని మోదీ

పారిస్‌ ఒలింపిక్స్‌లో (Paris Olympics) భారత్ ఖాతా తెరిచింది. భారత షూటర్‌ ఒలింపిక్స్ లో మను భాకర్‌ (Manu Bhaker) కాంస్య పతకం సాధించి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. 10మీ ఎయిర్‌ పిస్టల్‌ లో కాంస్య పతకం సాధించింది మను. దీంతో మను భాకర్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌ లో భారత్‌ మొదటి పతకం సాధించడంపై ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. యువ షూటర్‌ మను భాకర్‌ను పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 12 ఏళ్ల తర్వాత భారత్‌ కు పతకం రావడం విశేషం.

పారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రతిభతో కాంస్య పతకం సాధించి దేశం కీర్తిని చాటిన మను భాకర్‌ కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందనలు తెలియజేశారు. ఆమెను చూసి దేశం గర్వపడుతోందని అన్నారు. మను భాకర్ సాధించిన ఈ విజయం ఎంతో మంది క్రీడాకారులకు, మహిళలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి కొనియాడారు. పారిస్ ఒలింపిక్స్ లో భారత్‌కు తొలి పతకం అందించిన మను భాకర్‌ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. షూటింగ్‌ లో ఇండియా తరఫున కాంస్య పతకం సాధించడంతో పాటు ఈ ఘనత అందుకున్న తొలి మహిళగా మను భాకర్ రికార్డు సృష్టించిందని కొనియాడారు.


Comment As:

Comment (0)