స్వామీ మీరేదిక్కు ..!

news02 July 4, 2019, 5:35 p.m. political

Sharada petam

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో అన్ని రోడ్లు విశాఖ శారదాపీఠం వైపు దారి చూపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రులు .. వీఐపీలు ..  స్వరూపానందేంద్రస్వామి సేవలో తరిస్తున్నారు. ఆయన ఆశీర్వచనాలు .. ఆలింగనాలు .. నుదుటిమీద ముద్దుల కోసం పరి తపిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు వివిధ సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ల వారు కూడా స్వామివారి పాదాలకు మొక్కుతున్నారు. మీరే దిక్కంటూ ప్రణామాలు చేస్తున్నారు. ఏపీలోని రేషన్ డీలర్లందరూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపాంద వద్దకు వెళ్ళారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Sharada petam

సీఎం జగన్ ఈమధ్య గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్లే ఇకనుంచి రేషన్ సరుకులు కూడా డోర్ డెలివరీ చేస్తారని ప్రకటించారు. దీంతో రేషన్ డీలర్ల వ్యవస్థ కనుమరుగు కావడం ఖాయమని, తమ ఉపాధికి గండిపడినట్టేనని రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో స్వరూపానందను కలిసి తమ కష్టనష్టాల గురించి విన్నవించుకున్నారు. అసలు స్వామి ఎవరు .. ఆయన మన రాష్ట్రానికి గవర్నరా .. ముఖ్యమంత్రా ..మంత్రా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా .. అసలు ఒక పీఠాధిపతి అన్ని రాజ్యాంగబద్ధ అధికార పీఠాలను కదిలించే శక్తి ఎలా సంపాదించారు. 

SHarada petam

ప్రభుత్వ నిర్ణయాలను సైతం పీఠాధిపతులు శాసించగలరా .. ఒక పీఠాధిపతి ఇలా రేషన్ డీలర్లను తనను కలిసే అవకాశం ఇవ్వవచ్చా . ఇచ్చారనుకుంటే తమ సమస్యల పరిష్కారం కోసం స్వామిజీని ఆశ్రయించడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పరిపాలనలో ఆయన జోక్యం చేసుకుని, రేషన్ డీలర్లకు అన్యాయం జరగకుండా కాపాడగలరా . రేపు ఏ అక్రమ నిర్మాణాలు చేసిన బిల్డర్లో, పారిశ్రామిక వేత్తలో కూడా స్వామీజీని కలిసి న్యాయం చేయమంటే స్వామీజీ వారికి కూడా అభయం ఇచ్చేస్తారా . తెలంగాణలో మొన్నీమధ్య రెవెన్యూ ఉద్యోగులు చిన్న జీయర్ స్వామిని కలిసి తమ శాఖను కాపాడాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీలోని ఇదే తరహా ఘటన జరిగింది. చివరకు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా తయాయింది.

Sharada petam

tags: VISHAKA SHARADA PETAM,SWARUPANANDA SWAMI,AP CM, JAGAN MOHAN REDDY,KCR,RESHAN DELARS, REVENUE EMPLOYEES,ANDRAPRADESH,TELANGANA,CM KCR,CHINNA JIAR SWAMI,VISHAKAPATNAM, HYDERABAD,JAGAN VIST SHARADA PETAM,KCR VIST SHARADA PETAM

Related Post