ఏపీ గవర్నర్ గా బిశ్వ భూషన్

news02 July 17, 2019, 6:36 a.m. political

bishwa bhushan

ఏపీ కొత్త గవర్నర్‌గా ఒడిశా బీజేపీ సీనియర్ నాయకుడు బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయవర్గాల్లో ప్రసాద్‌ హరిచందన్‌గా పాపులర్‌ అయిన బిశ్వ భూషణ్ సుదీర్ఘకాలంగా సంఘ్‌పరివార్‌తో అనుబంధం కలిగివున్నారు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఇప్పటి వరకూ ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుని.. రాష్ట్ర విభజన జరిగిన కొన్నేళ్లపాటు నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. అయితే తెలంగాణకు నరసింహన్‌నే గవర్నర్ గా కొనసాగిస్తారా.. లేదంటే కొత్త గవర్నర్‌ను నియమిస్తారా.. అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

tags: ap new governor, ap new governor bishwa bhushan, bishwa bhushan ap new governor, andhra pradesh new governor bishwa bhushan, bishwa bhushan appointed as a ap governor, bishwa bhushan harikiran

Related Post