శ్రీ రెడ్డి పోవాల్సింది టివి స్టూడియో లు కాదు

news02 April 14, 2018, 6:02 p.m. political

Pawan on sri reddy

హైదరాబాద్ : సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన ఉద్యమం పై మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆషిఫా పై లైంగిక దాడి చేసి చంపేసిన సంఘటనపై నెక్లస్ రోడ్ లో మౌన దీక్షకు దిగారు పవన్. దేశంలో మహిళలకు రక్షణ కరువైందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 సినీ ఇండస్ట్రీ లో తెర వెనుక జరుగుతున్న తతంగంపై శ్రీ రెడ్డి చేసిన ఆందోళన పై పవన్ స్పందించారు. ఇలాంటి అన్యాయాలు జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి తప్ప టివి స్టూడియో లకు కాదని అన్నారు. టివి షో లకు వెళ్ళటం ద్వారా ప్రజలకు సందేశం వెళ్తుంది తప్ప న్యాయం జరగదని పవన్ అన్నారు. తన సినిమా షూటింగ్ జరిగే సమయంలో ఇలాంటివి తన దృష్టికి వస్తే అవి అడ్డుకున్నట్లు చెప్పారు పవన్.

సార్ కు కృతజ్ఞతలు

తన ఆందోళనపై స్పందించిన పవన్ పై శ్రీ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్ మీరు స్పందించినందుకు కృతజ్ఞతలు అంటూ ట్విట్ లో పెట్టింది శ్రీ రెడ్డి

Related Post