కొత్త సెక్ర‌ట‌రీయేట్ కు ముహూర్తం ఫిక్స్

news02 June 11, 2019, 8:28 a.m. political

telangana_new_secretariet.

హైదరాబాద్ :తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త స‌చివాల‌య నిర్మాణానికి ముహూర్థం ఫిక్స్ చేసింది. ఏపీ భవనాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగింతపై ఇప్పటికే గవర్నర్ కూడా ఉత్తర్వులు జారీ చేయటంలో లైన్ క్లియర్ అయ్యింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. కొత్త భవనాలకు భూమి పూజ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదికూడా.. ప్ర‌స్తుత స‌చివాల‌యం ఉన్న‌చోటే.. ఈ కొత్త సెక్ర‌ట‌రియేట్ నిర్మాణం చేప‌ట్ట‌బోతున్నారు.  ఇప్ప‌డికే ఏపీ ,తెలంగాణ‌ ప్ర‌భుత్వాల ఉన్న‌తాధికారుల స‌మావేశంలో  సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి.. అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి.. ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ భవనాల అప్పగింత కేవలం వారం రోజుల్లో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తుంది. దీంతో.. కొత్త స‌చివాల‌య నిర్మాణం భూమి పూజ‌కు ఈనెల 27 ముహూర్తం ఫిక్స్ చేశారు కేసీఆర్. వేద పండితుల వేద మంత్రాల మ‌ధ్య కొత్త భ‌వనానికి భూఏమి పూజ‌ను నిర్వహించ‌నున్నారు కేసీఆర్. ఇప్పుడున్న‌ సచివాలయంలోని.. ఏ, బీ, సీ, డీ భవనాలను కూల్చివేయనున్నారు. నిర్మాణం పూర్త‌య్యే వ‌ర‌కు.. జే, సౌత్ హెచ్, నార్త్ హెచ్, ఎల్ బ్లాకుల నుంచి పరిపాలన కొన‌సాగ‌నుంది.

/telanagana_present_secretariat_building

అయితే మొద‌ట అనుకున్న‌విధాంగా.. సికింద్రాబాద్ బైస‌న్ పోలో గ్రౌండ్ లో అత్యాధునిక హంగుల‌తో స‌చివాల‌యాన్ని నిర్మించాలని కేసీఆర్ భావించారు. అయితే..అక్కడ నిర్మాణాలు చేయ‌రాద‌ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప‌లు ప్ర‌జా సంఘాలు.. క్రీడాకారులు ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఆంధోళ‌న కార్య‌క్ర‌మాల‌ను సైతం చేప‌ట్టింది. అంతేకాకుండా.. బౌస‌న్ పోలొ గ్రౌండ్ డిఫెన్స్ కు సంబంధించిన భూమి కావ‌డంతో.. అక్క‌డ నిర్మాణం చేప‌ట్ట‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందులు సృష్టించింది.   మొత్తానికి బైస‌న్ పోలో గ్రౌండ్ లో కాకుండా.. ప్ర‌స్తుతం ఉన్న చోటే.. కొత్త స‌చివాల‌యం కొలువు తీరనుంది.

tags: telangana new secretariat, present secretariat, a,c,b,d blocks, cm kcr, byson polo ground, difence land, secundrabad, secretariat innagural time fix, hyderabad

Related Post