టీఆర్ఎస్ గ్రాఫ్‌ను పెంచ‌లేక‌పోతున్న రైతు బంధు

news02 May 29, 2018, 3:15 p.m. political

raithu bandhu failure discussion in formers

హైద‌రాబాద్: రైతు బంధు ప‌థ‌కంపై టీఆర్ఎస్ నేత‌లు గంపెడాశ‌లు పెట్టుకున్నారు. రైతు బంధు ప‌థ‌కంతో రాబోయే ఎన్నిక‌ల్లో సుల‌భంగా గ‌ట్టేక్క‌వ‌చ్చ‌నే భావ‌న‌లో గులాబీ నేత‌లున్నారు. రైతుల‌కు పెట్టుబ‌డి స‌హాయంగా ఎక‌రాల‌కు 4వేలు అందించ‌డం ద్వారా పార్టీ ఓటింగ్ గ్రాఫ్‌ పెరుగుతుంద‌నుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు రైతు బంధు సంజీవ‌నిలా ప‌నిచేస్తుంద‌ని భావించారు. 

trs flag

అయితే ఈ ఆశ‌లేవి నేర‌వేరేట‌ట్టు క‌నిపించ‌డం లేదు. టీఆర్ఎస్ నేత‌లు రైతు బంధుపై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ ఆవిర‌వుతున్నాయి. క్షేత్ర స్థాయిలో సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయింది. రైతు బంధు అమ‌లు తీరుపై రైతుల్లో కొత్త చ‌ర్చ కొన‌సాగుతుంది. 80 శాతం జ‌నాభా ఉన్న రైతుల‌కు ఎంత మొత్తంలో రైతు బంధు డ‌బ్బులు ముట్టాయో...అంతే మొత్తంలో 20 శాతం మంది అన్న‌దాత‌ల‌కు డ‌బ్బులు అంద‌డంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. భూస్వాముల‌కు ల‌క్ష‌ల్లో డ‌బ్బులు ఇస్తే... చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు వేల‌ల్లో డ‌బ్బులు రావ‌డమేమిట‌నే చ‌ర్చించుకుంటున్నారు.  

villages

ఇప్పుడు గ్రామాల్లో ఏ ఇద్ద‌రూ రైతులు క‌లిసిన ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. భూ స్వాములు, బ‌డా రైతులు గ్రామాల్లో లేకున్నా.. వారికి డ‌బ్బులు అంద‌డంపై అన్న‌దాత‌లు ఒక్క‌రినొక్క‌రు ప్ర‌శ్నించుకుంటున్నారు. భూముల‌ను కౌలుకిచ్చిన బ‌డా రైతుల‌కు రైతు బంధు చెక్కుల‌ను అందించ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద  రైతుల‌కు కౌలు డ‌బ్బుల‌తో పాటు... స‌ర్కారు ఇచ్చే పెట్టుబ‌డి స‌హాయం అద‌నంగా అంద‌డం బ‌డా రైతుల‌కే మేలు చేస్తోంద‌ని అంటున్నారు. మొత్తంగా బ‌లిసినోడి కోస‌మే కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కం పెట్టాడ‌నే టాక్ వినిపిస్తోంది. 

formeer

స‌ర్కారు ఎక‌రాకు 4వేలు పెట్టుబ‌డి స‌హాయం ఇవ్వ‌డంపై కూడా అన్న‌దాత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం ఇచ్చే పెట్టుబ‌డి ఏమూల‌కు స‌రిపోద‌ని అంటున్నారు. దీని క‌న్నా..గ‌తం ప్ర‌భుత్వాల హ‌యంలో జ‌రిగిన మేలే ఎక్కువ‌ని చెబుతున్నారు. కేసీఆర్ ఎన్నిక‌ల స్టంట్‌గా మాత్రమే రైతు బంధు తెచ్చాడ‌ని అంటున్నారు. ఎక‌రాకు 4 వేలు మొహన కొట్టి... మిగ‌తా అన్ని విధాలా అన్న‌దాత‌ల‌ను ఇబ్బంది గురిచేశాడని అంటున్నారు. మొత్తంగా మ‌హిళ గ్రూప్‌ల‌కు వ‌డ్డీ లేని రుణం, రుణ మాఫీ నాలుగు విడుత‌లుగా చేయ‌డం. ఎంఎస్‌పీ(MSP) పెంచేందుకు ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం వంటి అంశాల్లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం చెందింద‌నే చ‌ర్చ అన్న‌దాత‌ల్లో కొన‌సాగుతోంది. 

uttam

అయితే టీఆర్ఎస్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన రైతు బంధు ప‌థ‌కం దాని మెడ‌కే చుట్టుకోవ‌డంపై ఆపార్టీ అధినేత కేసీఆర్ క‌ల‌వ‌ర‌పాటు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు రైతు బంధుకు సీలింగ్ విధించ‌క‌పోవ‌డంపై ప్ర‌జాక్షేత్రంలో నిల‌దీసిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనికి తోడూ స‌ర్కారు ప్రారంభించిన రైతు బంధుపై ప్ర‌జ‌ల్లో అనుకున్న స్థాయిలో మైలేజ్ రాక‌పోవ‌డంపై కూడా ఆందోళ‌న‌తో ఉన్న‌ట్లు స‌మాచారం. 

tags: kcr election stant,uttam,raithu bandhu,elections,formers,cheqes

Related Post