చైర్మ‌న్ స్వామిగౌడ్ కు నిజంగానే గాయ‌మైందా..?

news02 March 12, 2018, 1:02 p.m. political

హైదరాబాద్- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తొలిరోజే హీటెక్కాయి.గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం జ‌రుగుతుండ‌గా .. కాంగ్రెస్ ఎమ్మెల్యే విసిరిని హెడ్ సెట్ తో శాస‌న మండ‌లి చైర్మ‌న్ స్వామి గౌడ్ కు గాయ‌మైంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంతేకాదు స్వామి గౌడ్ కు స‌రోజిని కంటి ఆసుప‌త్రిలో చికిత్స కూడా జ‌రిగింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ ప‌లు అనుమానాల‌ను, ప్ర‌శ్నల‌ను లేవ‌నెత్తుతుంది. తాము గ‌వ‌ర్న‌ర్ పైకి కాగితాల‌ను విసిరిన మాట వాస్త‌వ‌మ‌ని అంటున్న‌కాంగ్రెస్ నేత‌లు.. స్వామిగౌడ్ కు దెబ్బ‌త‌గిలింద‌న్న వాద‌న‌ను మాత్రం త‌ప్పుప‌డుతున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం అంటున్న‌ట్లు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి విసిరిన హెడ్ సెట్ త‌గిలిన‌ట్లు అయితే.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌మ‌యంలో అది క‌నిపించేద‌ని.. అదే జ‌రిగితే.. స్వామిగౌడ్ ముఖంలో క‌నీసం అస‌హ‌న‌మైనా క‌నిపించేద‌ని అంటున్నారు. కాని అలాంటిది ఏమి క‌న‌బ‌డ‌లేదంటున్నారు. అంతేకాదు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన త‌ర్వాత స్వామిగౌడ్ , మ‌ధ‌సూధ‌నాచారి తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ న‌ర్సింహ్మ‌న్ ను బ‌య‌టి వ‌ర‌కు సాగ‌నంపార‌ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కూడా స్వామిగౌడ్ లో దెబ్బ త‌గిలిన ఫీలింగ్ క‌న‌బ‌డ‌లేద‌ని.. ఇవ‌న్నీ అసెంబ్లీ లైవ్ ఫీడ్ లో క‌నిపించాయ‌ని అంటున్నారు  హ‌స్తం నేతలు. ఇదంతా జ‌రిగిన చాలా సేప‌టి త‌ర్వాత చైర్మ‌న్ స్వామిగౌడ్ కు గాయ‌ల‌య్యాని ప్ర‌భుత్వం చెప్ప‌డం ప‌చ్చి అబ‌ద్దం అంటున్నారు. అత్యంత సున్నిహిత‌మైన కంటికి గాయ‌మైతే.. అర‌గంట త‌ర్వాత తెలియ‌డ‌మేంట‌ని ..? ప్ర‌శ్నిస్తున్నారు. ఇదిలావుంటే కోమ‌టి రెడ్డి విసిరిన హెడ్ సెట్ ప‌క్క‌న ఉన్న‌గోడ‌కు త‌గిలి.. అది స్వామిగౌడ్ కు తాకింద‌ని కొంద‌రు అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారని.. ఇదే నిజ‌మైతే.. అస‌లు స్వామిగౌడ్ కు క‌నీసం గాయం కూడా కాద‌ని అంటున్నారు. ఇందంతా చూస్తుంటే.. ప్ర‌భుత్వం కావాల‌నే కుట్ర‌చేసి స్వామిగౌడ్ కు గాయం అయ్యిందని .. దీన్ని సాకుగా చూపి త‌మ ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని చూస్తుంద‌ని అనుమానిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇలా కాంగ్రెస్ ప‌లు అనుమానాలను లేవ‌నెత్తుతుంది. మ‌రి నిజంగానే చైర్మ‌న్ స్వామిగౌడ్ కు గాయ‌మైందా.. ? లేదా..?  కాంగ్రెస్ అనుమానిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం కుట్ర‌లో చైర్మ‌న్ ను పావుగా వాడుకుంటున్నారా..?  ఇంత‌కు ప్ర‌భుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రు చెబుతున్న‌ది నిజం..?  ఇవే ఇప్పుడు యావ‌త్తు ప్ర‌జ‌ల‌ను వేదిస్తున్నాయి. 

tags: swami goud, swamy goud injured, swami goud injured in assemby, telangana assembly, komatireddy venkat reddy, governer speech, headphone.

Related Post