రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి కేసీఆర్ మాటలు తప్పని నిరూపిస్తాం

news02 May 30, 2018, 8:32 p.m. political

Toch chief uthamkumar reddy counter to cm kcr

సంగారెడ్డి: రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదన్న సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏది ఏమైనా 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1.90 లక్షల కోట్ల బ‌డ్జెట్ ఉంటుంద‌ని... ఈబ‌డ్జెట్‌లో రైతు రుణ మాఫీకి పెద్దపీట వేస్తామ‌న్నారు. గ‌తంలో ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామ‌ని... అలాగే ఏక మొత్తంలో రుణ‌మాఫీ అమ‌లును విజ‌య‌వంతం చేసి చూపిస్తామ‌న్నారు. తెలంగాణ రైతులు అప్పుల బాధతో ప్ర‌స్తుతం దిక్క‌తోచ‌ని స్థితిలో ఉన్నార‌ని... అందుకే రాబోయే ఎన్నిక‌ల్లో వారిని ఆదుకునేందుకే రుణ‌మాఫీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. రైతుల రుణ మాఫీని అమ‌లు చేయ‌డంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు. కేసీఆర్ త‌న‌లాగే కాంగ్రెస్ పార్టీ రుణ మాఫీ చేయ‌లేద‌ని అనుకుంటున్నార‌నీ... కేసీఆర్‌వి ఒట్టి మాట‌ల‌ని నిరూపిస్తామ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అన్న‌దాత‌లంద‌రికీ 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని తెలిపారు.

Utham on 2 laks runapadi

 టీఆర్ఎస్ స‌ర్కారు అన్న‌దాత‌ల‌పై ప‌క్ష‌పాతం ధోర‌ణితో వ్య‌వహ‌రిస్తోంద‌ని... ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 500 మంది రైతులు చ‌నిపోతే స‌ర్కారు ఏ మాత్రం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, మంత్రి హ‌రీష్‌రావు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రైతును ప‌రామ‌ర్శించిన పాపాన పోలేద‌న్నారు. సంగారెడ్డి లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ దీక్ష కు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈసంద‌ర్భంగా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ...సంగారెడ్డిలో వెంట‌నే మెడిక‌ల్ క‌ళాశాల ఏర్పాట‌య్యేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మెడిక‌ల్ కాలేజ్ నిర్మిస్తే.. 8 నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌న్నారు. సంగారెడ్డిలో ఇప్ప‌టికే వైద్య క‌ళాశాల ఏర్పాటు కావాలసిందన్నారు. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని..అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే సంగారెడ్డిలో మెడిక‌ల్ క‌ళాశాల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Tpcc Utham kumar reddy

 విద్యార్థుల‌ను కూడా కేసీఆర్ స‌ర్కారు దారుణంగా మోసం చేసింద‌న్నారు. ముఖ్య‌మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఓయూ విద్యార్థి ముర‌ళి ఆత్మ‌హ‌త్య చేసుకుంటే... ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అయితే ముర‌ళి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన కాంగ్రెస్ నాయ‌కుడు ప్ర‌తాప్‌రెడ్డిపై కేసులు న‌మోదు చేయ‌డం మాత్రం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌జా వ్య‌తిరేక సీఎం కేసీఆర్‌కు గ‌జ్వేల్ ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గిన విధంగా గుణ‌పాఠం చెబుతార‌ని తెలిపారు.

tags: Utham kumar reddy, jagga reddy, sanga reddy medical college, sanga reddy constancy, geetha reddy, onteru pratap reddy, jagga reddy deeksha.

Related Post