పోచారం ఏకగ్రీవం

news02 Jan. 18, 2019, 7:24 p.m. political

pocharam

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే పోచారం స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రకటించారు. ఆ తరువాత సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ తదితరులు పోచారంను స్పీకర్‌ కుర్చీ వరకు తోడ్కొని వెళ్లారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌ అహ్మద్ ఖాన్ నుంచి పోచారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

pocharam

 

tags: pocharam, pocharam srinivas reddy, speaker pocharam, speaker pocharam srinivas reddy

Related Post