సేవా మిత్ర యాప్ పై కేసీఆర్ దొంగ సాక్ష్యాలు సృష్టించే ప్ర‌య‌త్నం ..!

news02 March 6, 2019, 9:37 p.m. political

telangana elections

అమ‌రావ‌తి : తెలంగాణలో జరిగిన ఎన్నికలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని ఆంద్ర‌ప్ర‌దేశ్  ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్‌ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా వార్ పై స్పందించిన ఆయ‌న .. పబ్లిక్‌ డొమైన్ లో ఉన్న సమాచారమే ఐటీ గ్రిడ్‌ దగ్గర ఉందన్నారు. సేవా మిత్ర యాప్ లో ఉన్నవి ఓటరు ఫొటోలు కాదని తెలిపారు. 54 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు .. కుటుంబసభ్యుల ఫొటోలను సేవా మిత్ర యాప్ కు అనుసంధానం చేసినట్లు చెప్పారు. తెలంగాణ పోలీసులు సేకరించిన డేటా వివరాలు చెప్పలేదన్నారు. తెలంగాణ పోలీసుల ఎఫ్‌ఐఆర్ .. సీపీ సజ్జనార్‌ రిపోర్ట్‌ వివరాలు అయోమయంగా ఉన్నాయని వెల్లడించారు.

telangana elections
 
ఈ విష‌యంలో తెలంగాణ పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవన్నారు ఆయ‌న . కావాల‌నే దొంగ సాక్ష్యాలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీ పోలింగ్‌ బూత్‌ మెంబర్లనే టార్గెట్‌ చేయడమే వారి పనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చెందిన డేటా లీకయ్యే అవకాశమే లేదన్నారు. టీఆర్‌ఎస్‌ మిషన్‌ అని ఇంటర్నెట్ లో సెర్చ్‌ చేస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ డేటాను ఎలా దుర్వినియోగం చేస్తుందో కుప్పలు తెప్పలుగా వీడియోలు కనిపిస్తాయన్నారు. డేటా పేరుతో ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచం గమనిస్తోందని వివరించారు. తప్పుడు పనులు చేస్తూ చట్టం .. ఎథికల్‌ హ్యాకింగ్ లాంటి కబుర్లు చెబుతోందని మండిపడ్డారు. విచారణ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు పనులు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. ఏపీలో ఓ పార్టీకి రాజకీయలబ్ధి చేసేందుకు ప్రభుత్వంపై ఇలాంటి ప్రచారం చేయడం హేయమైన చర్యగా ఆయ‌న అభివర్ణించారు.

telangana elections

tags: TELANGANA ELECTIONS RESULTS,KCR,CHANDRA BABU,NARA LOKESH,KTR,UTTAM KUMAR REDDY,TELANGANA BHAVAN,AMARAVATHI,YS JAGAN MOHAN REDDY,CONGRESS,BJP,YSRCP,TELANGANA ELECTIONS

Related Post