రాష్ట్రంలో న్యాయ‌వ్య‌వ‌స్థపై న‌మ్మ‌కం పోతోంది ..!

news02 March 10, 2018, 3:25 p.m. political

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ద‌ళిత ద్రోహులు రాజ్య‌మేలుతున్నార‌ని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ద‌ళితుల ఓట్ల కోసం ఎన్నిక‌ల ముందు కేసిఆర్ అనేక హామీలు ఇచ్చి .. వారి ఓట్ల‌తో గ‌ద్దెనెక్కి చివ‌ర‌కు వారికి న్యాయం చేయ‌క పోగా ..  వారిపై అమానుషంగా దాడులు చేస్తున్నార‌ని ఆయ‌న ద్వ‌జ‌మెత్తారు . తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా ధ్వంస‌మ‌య్యింద‌న్న ఉత్త‌మ్ .. చివ‌ర‌కు న్యాయ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌జ‌ల‌కు న్యాయం చేయ‌డం లేద‌న్నారు. సికింద్రాబాద్ లోని జ‌య‌ల‌క్ష్మి గార్డెన్ లో దిశ పేరుతో జ‌రిగిన ఎస్‌.సి సెల్ ప్లీన‌రీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఈ స‌మావేశానికి ఎస్‌.సి విభాగం అధ్య‌క్షుడు ఆరేప‌ల్లి మోహ‌న్ అధ్య‌క్ష‌త‌న వ‌హించ‌గా ఎఐసిసి ఎస్‌.సి సెల్ విభాగం అధ్య‌క్షుడు కొప్పులు రాజు .. ఎఐసిసి తెలంగాణ ఇంచార్జ్ ఆర్‌.సి కుంటియా .. కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు మ‌ల్లు  భ‌ట్టి విక్ర‌మార్క .. ఎమ్మెల్యేలు  గీతారెడ్డి, సంప‌త్‌కుమార్‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద్ రాజ‌న‌ర్సింహ్మ‌, మాజీ మంత్రులు ప్ర‌సాద్ కుమార్‌, చంద్ర‌శేఖ‌ర్‌, విజ‌య‌రామారావు, మాజీ ఎం.పి మ‌ల్లు ర‌విల‌తోపాటు మాజీ మ్మెల్యేలు , పార్టీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ద‌ళితుల‌ను పెద్ద ఎత్తున మోసం చేసిన కేసిఆర్ రాబోయే ఎన్నిక‌ల‌లో త‌గిన బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. నేరేళ్ళ‌లో ఇసుక మాఫియాకు మంత్రి కేటిఆర్ అండ‌గా ఉండి ద‌ళితు ప్రాణాల‌ను బ‌లి తీసుకున్నాడ‌ని ఆరోపించారు. ఇసుక డ‌బ్బుల‌తో కేటిఆర్  ద‌ళితుల‌పై దాడులు చేయించార‌ని మండిప‌డ్డారు. పోలీసులు ద‌ళితుల‌ను విచ‌క్ష‌ణ ర‌హితంగా హింసించిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ద‌ళితుల‌కు అర్హులైన ప్ర‌తి ఒక్కరికి మూడు ఎక‌రాల భూమి ఇస్తామ‌ని హామీ ఇచ్చిన టిఆర్ఎస్ మాన‌కొండురు నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితుల‌కు భూమి ఇస్తామ‌ని 40 వేలు లంచం తీసుకొని భూమి ఇవ్వ‌క‌పోతే ఇద్ద‌రు ద‌ళిత యువ‌కులు ఆత్మ‌హ‌త్య య‌త్నం చేస్తే ఒక‌రు మృతి చెందార‌ని ఒక‌రు జీవితంలో ప‌నికిరాకుండా అయ్యార‌ని ఇది వారి భూమి పంపిణీ వ్య‌వ‌హార‌మ‌ని విమ‌ర్శించారు. 

4 ఏళ్ళ పాటు ద‌ళితుల‌కు భూమి ఇవ్వ‌కుండా .. భూమి దొర‌క‌డం లేద‌ని సాకు చెబుతున్నార‌ని ద‌ళితులకు కేసీఆర్ మోసం చేశాడ‌న్నారు ఉత్త‌మ్. అర్హులైన ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి 3ఎక‌రాల‌ భూమి ఇవ్వాల‌ని .. లేక‌పోతే అంత‌కు స‌మాన‌మైన ఎక‌రానికి 5 ల‌క్ష‌ల చొప్పున 15 లక్ష‌ల రూపాయ‌లు డిపాజిట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌త్రిక‌లు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారాయ‌న్న ఆయ‌న ..  దుర‌దృష్ట‌మేమిటంటే న్యాయ‌వ్య‌వ‌స్థ వ‌ల్ల కూడా ప్ర‌జ‌ల‌ను న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్నారు. ద‌ళితుల‌పై జ‌రిగిన దాడుల‌కు సంబంధించి అనేక కేసుల‌ను కోర్టులు రోజుల త‌ర‌బ‌డి పెండింగ్ లో పెడుతున్నాయ‌ని ఇది బాధాక‌ర‌మైన విష‌య‌మ‌ని ఆయ‌న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు. ద‌ళితులు ఏకంగా టిఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని బొంద పెట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 

ఎఐసిసి ఎస్‌.సి సెల్ చైర్మ‌న్ కొప్పుల రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్తలు, ముఖ్యంగా ఎస్‌.సి ఎస్‌.టి నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఎల్‌.డి.ఎం.ఆర్‌.సి విధానాల ప్ర‌కారం ప‌నిచేస్తే ఖ‌చ్చితంగా 25 సీట్లు గెలుస్తామ‌ని అన్నారు. తెలంగాణ‌లో లక్ష మంది ద‌ళిత సైనికులు సిద్దంగా కావాల‌ని, ద‌ళితుల‌కు పార్టీలో త‌గిన ప్రాధాన్య‌త గ‌ల ప‌దువులు ఇవ్వాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఆలోచ‌నా విధానం ప్ర‌కారం ప‌నిచేయాల‌ని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ద‌ళితుల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి అని, వారికి అనుకూల‌మైన విధానంతో ప‌నిచేయాల‌ని ద‌ళితుల‌కు మేలు జ‌ర‌గాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఆయ‌న సూచించారు. కుంటియా మాట్లాడుతూ ప్ర‌తిప‌క్షాల‌ను బ‌ల‌హీన ప‌రిచేందుకు కేసిఆర్ మూడో ఫ్రంట్ అంటూ నాట‌కాలు ఆడుతున్నార‌ని, అక్క‌డ మోడీని, ఇక్క‌డ కేసిఆర్‌ను గ‌ద్దె దింపాల‌ని అందుకు కార్య‌కర్త‌లు, ప్ర‌జ‌లు స‌న్న‌ద్దంగా ఉన్నార‌ని అన్నారు. 

రాహుల్ గాంధీ యువ‌కులకు, ద‌ళిత, గిరిజ‌న‌, బిసిల‌కు ప్రాధాన్య‌త ఇచ్చేందుకు కృషి చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్‌పార్టీ అధికారం ఖాయ‌మ‌ని అన్నారు. భ‌ట్టి విక్ర‌మార్క .  టిఆర్ఎస్ ప్ర‌భుత్వ హాయంలో ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలు, నిర్బంధాలు, నియంత పాల‌న‌పై ద‌ళితులు ఊర్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ చేయాల‌ని పిలుపునిచ్చారు. ద‌ళితుల‌ను కేసిఆర్ అవ‌మాన‌ప‌రిచారు, ద‌ళిత ఉప ముఖ్య‌మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేశార‌ని, అవ‌మానాలు, అస‌మాన‌త‌లు లేని స‌మాజాన్ని నిర్మించాల‌ని అంబెద్క‌ర్ క‌ల‌లు క‌న్నార‌ని మ‌నమంతా క‌లిసి ప‌నిచేస్తేనే అది సాధ్య‌మ‌ని అన్నారు. 

tags: Uttam Kumar Reddy Hot Comments On KCR Govt,Gandhibhavan,JANAREDDY,Mallu Bhatti Vikramarka

Related Post