ఇంట‌ర్ వివాదం వెనుక కేటీఆర్ ..!

news02 April 30, 2019, 10 p.m. political

REVANTH REDDY

హైద‌రాబాద్ : ఇంట‌ర్ బోర్డ్ వివాదం వెనుక  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడ‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రిసిడెంట్  రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గ్లోబరీనా గురించి తెలియదంటూ ఆయ‌న‌ ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి .. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనాలకు టెండర్లు కట్టబెట్టడం వెనుక అస‌లు సూత్ర‌దారి కేటీఆరే అని ద్వ‌జ‌మెత్తారు. ఇదంతా కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందన్నారు రేవంత్ . ఎంసెట్ పరీక్షల నిర్వహణ కోసం 1996 లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఏర్పాటైందని .. అప్పట్లో పరీక్షల ప్రకటన, ముద్రణ, ఫలితాలు మూడు సంస్థలకు అప్పగించేవాన్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదన్నారు. కానీ 2016లో అన్నిటినీ కలిపి మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్‌కు కట్టబెట్టారన్నారు. ఆ సమయంలోనే ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్నారు. దీనిపై సీబీసీఐడీకి కేసు అప్పగించినా.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా నీరుగార్చారని విమర్శించారు. 

REVANTH REDDY

ఎంసెట్ ప్రశ్నపత్రాలు లీక్ లో ప్రధాన నిందితులు ఇద్దరూ చనిపోయిన అంశాన్ని ప్ర‌స్థావించిన రేవంత్  .. ఒకరు కస్టడీలో చనిపోగా మరొకరు ప్రమాదవశాత్తు చనిపోయారని ... ఆ రెండూ అనుమానాస్పద మరణాలే అన్నారు. దీనిపై ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. పరీక్షలు నిర్వహించిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ కు చెందిన విజయ రావు .. ప్రద్యుమ్నలపై ఎందుకు దృష్టి పెట్టలేదన్నారు. గ్లోబరీనా .. మ్యాగ్నటిక్ సంస్థలూ రెండు భాగస్వామ్య సంస్థలు. దుర్మార్గంగా 23 మంది చావులకు కారణమయ్యాయి. కంపెనీల పేర్లు వేరు ... వీళ్లంతా ఒక్కటే. కలిసి వ్యాపారం చేస్తున్నారన్నారు.

REVANTH REDDY

కాకినాడ జేఎన్‌టీ‌యూ వారు గ్లోబరీనా .. మ్యాగ్నటిక్ సంస్థల‌పై క్రిమినల్ కేసులు పెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థ నిషేధిత సంస్థ. అలాంటి సంస్థ టెండర్ ను పక్కన పెట్టి .. గ్లోబరీనాకు ఇవ్వడంలోనే వాళ్ల అస‌లు ఉద్దేశం దాగుందన్నారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే టెండర్లు వేశారన్న ఆయ‌న .. ఎవరిని మభ్య పెడుతున్నారంటూ .. కేటీఆర్ పై విరుచుకుప‌డ్డారు. అస‌లు ఈ టెండ‌ర్ల వెనుక పెద్ద కుట్ర జరిగిందని ..  రాష్ట్రంలో 10 లక్షల మంది ఇంటర్ చదువుతున్నారు. ఒక్కో విద్యార్థిపై కనీసం లక్ష ఖర్చుపెడుతున్నారు. ఏటా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇది అన్నారు. విద్యార్థుల డేటాను ప్రైవేటుకి ఇచ్చారు .. దీనికి  నిబంధనలు ఒప్పుకోకున్నా .. కార్పొరేట్ కాలేజీల మాఫియా .. దోపిడీకి త‌లొగ్గ ఇదంతా చేశార‌న్నారు రేవంత్ రెడ్డి. 

REVANTH REDDY

tags: INTER BORD,INTERMEDIATE RESULTS,KTR,KCR,REVANTH REDDY,CONGRESS,TRS,BJP,INTER BORD DHARNA,ALL PARTY DHARNA AT INTER BORD,UTTAM KUMAR REDDY,NSUI,YOUTH CONGRESS,PONNAM PRABHAKAR

Related Post