ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్క‌ర‌ణ ..!

news02 Jan. 9, 2019, 5:27 p.m. political

ys jagan

అమ‌రావ‌తి : ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. 341 రోజులు .. 3,648 కిలోమీటర్ల పొడుగున జ‌గ‌న్ పాదయాత్ర చేశారు. 134 నియోజకవర్గాలు .. 2,516 గ్రామాల్లో ఆయ‌న పాద‌యాత్ర సాగింది. పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో నిర్మిస్తున్న పైలాన్ కు గెలాక్సీ గ్రానైట్‌ వాడారు. రెండు కోట్లను ఈ నిర్మాణం కోసం వెచ్చించారు. 88 అడుగుల ఎత్తులో .. విజయస్థూపం .. పేరుతో దీన్ని నిర్మించారు. గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ..  ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర .. ఇప్పుడు జగన్‌ పాదయాత్ర కలిపి మొత్తం ముగ్గురి పాదయాత్రలు గుర్తుకు వచ్చేలా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. 

ys jagan

జగన్‌ పాదయాత్ర 13 జిల్లాల్లో సాగిందనేదానికి గుర్తుగా ఈ స్థూపం అడుగునుంచి అన్నే మెట్లు నిర్మించారు. మొత్తం నాలుగు పిల్లర్లపై మూడు అంతస్థులతో ఈ స్థూపం నిర్మాణం జరిగింది. మొదటి అంతస్థులో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఫొటో .. రెండో అంతస్థులో వైఎస్‌ ఫొటోను ఉంచారు. స్థూపం అడుగు నుంచి పై వరకు 15 అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పాదయాత్ర స్థూపం చుట్టూ ఉన్న ప్రహరీపై పాదయాత్ర విశేషాలు పొందుపరిచారు.


 ys jagan
జగన్ చేపట్టిన ఈ ప్రజాసంకల్ప యాత్ర ఈరోజుతో ముగిసింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం నుంచి బయలుదేరి ఇచ్ఛాపురం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు జాతీయ రహదారిని ఆనుకుని బహుదా నదికి సమీపంలో నిర్మించిన పాదయాత్ర పైలాన్ ను జ‌గ‌న్ ఆవిష్కరించారు. అక్కడే 341 రోజులుగా 3,656 కిలోమీటర్ల మేర సాగిన తన యాత్రను ఆయన ముగించారు.. ఊరేగింపుగా ఇచ్ఛాపురం పాతబస్టాండ్‌ వరకు నడిచి.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిచారు.

ys jagan

tags: YS Jagan Mohan Reddy Padayathra,ys rajashekar reddy,ys sharmila,ys vijayamma,ysrcp,ysr congress,ichapuram pailan,andrapradesh,ap cm,chandrababu naidu,nara lokesh,ap assembly,ys jaganmohanreddy

Related Post