కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు...?

news02 April 17, 2018, 12:09 p.m. political


ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి కొత్త అధ్య‌క్షుడు ఏవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ కొన‌సాగుతుంది. ఎపీ బిజెపి అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న కంభంపాటి హ‌రిబాబు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఆ పీఠం ఏవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త ద‌ళ‌ప‌తిగా ఏవ‌రు నియామ‌కం అవుతార‌నే దానిపై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది. హ‌రిబాబు ప్ర‌త్యేక హోదాపై బిజెపి మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌క‌పోవ‌డం, మృదుస్వాభావిగా పేరుండ‌డంతో.. కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌తిప‌క్షాల‌కు ధీటుగా బ‌దులిచ్చే నాయ‌కుల‌ను అధ్య‌క్షుని హోదాలో పెట్టాల‌ని భావించిన‌ట్లు స‌మాచారం. ఈనేప‌థ్యంలో కొత్త అధ్య‌క్షుడు ఎంపిక‌లో కేంద్ర నాయ‌క‌త్వం ఏఏ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది...అధ్య‌క్ష ప‌ద‌వికి ఏవ‌రికి అవ‌కాశం ఇస్తుంద‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

పోటీలో చాలా మంది...
అయితే కొత్త అధ్య‌క్ష ప‌ద‌వికి చాలా మంది పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. హ‌రిబాబు రాజీనామా నేప‌థ్యంలో ప‌ద‌విని వ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్టున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, సోము వీర్రాజు, ఫురందేశ్వ‌రీ, మానిక్యాల‌రావు వంటి వారు అధిష్టానం ఆదేశిస్తే ప‌ద‌వి అలంక‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని..ప్ర‌స్తుతం అధికార ప‌క్షంతో పాటు విప‌క్షాలు ఎపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని గ‌గ్గోలు పెడుతున్నాయి. ఈనేప‌థ్యంలో అటూ విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ధీటుగా ఎదుర్కొనే నేత‌కు ఛాన్సు ఉంటుంద‌ని పార్టీ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప‌రిపాల‌న,రాజ‌కీయ‌ అనుభ‌వం ఉన్న వారి కూడా అవ‌కాశాలు లేక‌పోలేద‌ని చెబుతున్నారు. 

ప్ర‌త్యేక హోదాపై ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ధాటిగా బ‌దులిస్తూ.. సోమువీర్రాజు ఇప్ప‌టికే అధిష్టానం దృష్టిలో ప‌డ్డారు.  ఆయ‌న  ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విడుద‌ల చేసిన నిధుల‌ను గ‌ణంకాల‌తో వివ‌రించి విప‌క్షాల‌కు స‌మాధామిచ్చారు. ఈవిధంగా ఆలోచిస్తే వీర్రాజుకు అవ‌కాశం ల‌భించ‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే అనుభ‌వం దృష్ట్యా మాజీ కేంద్ర మంత్రి ఫురందేశ్వ‌రి, మాజీ రాష్ట్ర మంత్రి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌, మాణిక్యాల‌రావుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌ని భావిస్తోస్తున్నారు. ప‌రిపాల‌న‌, రాజ‌కీయ అనుభ‌వం వీరికి ప్ల‌స్ పాయింట్ అయ్యే ఛాన్సుంద‌ని అంటున్నారు. మొత్తంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం జోరుగా కొన‌సాగుతున్న సంద‌ర్భంగా కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రానికి చేసి స‌హాయంపై త‌గు రీతిలో స్పందించే వారికే అధిష్టానం అవ‌కాశం ఇచ్చే ఛాన్సు ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్నాట‌క ఎన్నిక‌లు పూర్తి కాగానే  కొత్త అధ్య‌క్షుడు ఏవ‌ర‌నేది తెల‌నుంది. ఎన్నిక‌ల పూర్తి కాగానే ఎపీ అధ్య‌క్ష పీఠంపై ఓ క్లారిటీకి రానున్న‌ట్లు స‌మాచారం. 

tags: new president,bjp,purandeshvari,manikyalarao,somiveeraju,haribabu,kambhapati haribabu,amith sha

Related Post