లోకేష్ ఛాంంబర్ అంటే భయపడుతున్న వైసీపీ మంత్రులు

news02 June 15, 2019, 9:08 a.m. political

Lokesh chambar

అమరావతి : ఏపీలో కొత్త మంత్రులకు చాంబర్ల కేటాయింపులో ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. గతంలో చంద్రబాబుహయాంలో ఆయన తనయుడు లోకేశ్‌ మంత్రిగా వ్యవహరించిన ఛాంబర్‌ను తీసుకోవడానికి అనేక మంది మంత్రులు నిరాకరిస్తున్నారు. లోకేశ్ చాంబర్ అనగానే వామ్మో ఆయన చాంబరా వద్దు .. వద్దు అంటున్నారు. పంచాయతీరాజ్, మైనింగ్ శాఖలను దక్కించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకు కేటాయించిన లోకేష్ ఛాంబర్ ను కాదని మరో ఛాంబర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది.

Lokesh chambar

లోకేశ్‌కు కేటాయించిన ఛాంబర్‌ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరాకరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. లోకేశ్ ఛాంబర్ ఎంతో విశాలంగా, అత్యాధునికంగా ఉన్నప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం ఈ ఛాంబర్‌పై ఆసక్తి చూపలేదు. ఈ ఛాంబర్ వాస్తు సరిగ్గా లేదని ... అందుకే ఆయన ఈ ఛాంబర్‌ను వదులుకున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ ఛాంబర్‌కు వాస్తు మార్పులు చేయించడం కంటే .. మరో ఛాంబర్‌ను ఎంచుకోవడం మంచిదనే ఉద్దేశంతోనే ఆయన మరో ఛాంబర్‌ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉండి ఎన్నికల్లో ఓడిపోయిన మిగతా ఛాంబర్లు కూడా నిరాదరణకు గురవుతున్నాయి. 

Lokesh chambar

25 మంది మంత్రులకు సచివాలయంలోని 2, 3, 4, 5 బ్లాకుల్లో ఛాంబర్లను ఇచ్చారు. మొత్తం మీద ఓటమి పాలైన లోకేష్ ఛాంబర్ అంటే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరో ముగ్గురు మంత్రులు లోకేష్ ఛాంబర్ వైపు అడుగులు వేయడానికి నిరాకరించారు. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న చిన్నబాబు ఛాంబర్ ను ఎవరికి కేటాయించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు

Lokesh chambar

tags: NARA LOKESH,NARA CHANDRABABU NAIDU,AP EX MINISTER LOKESH,LOKESH CHAMBER,PEDDIREDDY RAMCHANDRA REDDY,YCP MINISTERS,YS JAGAN MOHAN REDDY,AP ASSEMBLY,AP GOVT,TDP MINISTER'S,BJP,YSRCP,TDP,CONGRESS, JANASENA,PAWAN KALYAN AP MINISTER'S CHAMBERS

Related Post