కాంగ్రెస్ శ్రేణుల్లో వెల్లివిరిసిన ఆనందం

news02 Jan. 23, 2019, 10:17 p.m. political

priyanka

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. తమ ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా పార్టీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటూ వస్తున్నారు. ఇదిగో ఉన్నాళ్లకు వారందరి కల నెరవేరబోతోంది. ఇందిరాగాంధీ మనవరాలు.. రాజీవ్ గాంధీ-సోనియా ల ముద్దుల కూతురు ప్రియాంక గాంధీ ఇకపై ప్రత్యక్ష్య రాజకీల్లోకి వస్తున్నారు. ఇప్పటి దాకా అక్కడక్కడా ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం అయిన ప్రియాంక గాంధీ ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

priyanka

ఉత్తర్‌ ప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని కాంగ్రెస్‌ విభాగం జనరల్‌ సెక్రటరీగా ప్రియాంక గాంధీని నియమిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ తన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ప్రియాంత గాంధీ కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతుందా.. లేక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అన్నదానిపైనా కాంగ్రెస్ పార్టీలో జోరుగో చర్చ జరుగుతోంది.

tags: priyanka, priyanka gandhi, priyanka gandhi wadra, priyanka gandhi political entry, priyanka gandhi aicc general secretary, priyanka gandhi up general secretary

Related Post