రాహుల్ ప‌ర్య‌ట‌న‌తో ఎన్నిక‌ల శంఖారావం ..!

news02 Aug. 6, 2018, 9:34 p.m. political

rahul tour

తెలంగాణ‌లోని సెటిల‌ర్లు .. ముస్లీంలు .. మేధావులతో పాటు  త‌దిత‌ర వ‌ర్గాల‌ను ద‌గ్గ‌ర‌య్యేందుకు కాంగ్రెస్  కాంగ్రెస్ పార్టీ క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది . ఏఐసీసీ అధ్య‌క్షుడుగా రాహుల్ గాంధీ  మొద‌టి సారి తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో టిఆర్ఎస్ .. బీజేపీ పాల‌న‌లో  న‌ష్ట‌పోయిన వ‌ర్గాల‌ను త‌మ‌వైపు ఆక‌ర్శించేందుకు ప్ర‌ణాళిక బ‌ద్దంగా ప‌ర్య‌ట‌న‌ను ఖ‌రారు చేస్తుంది. ఈ నెల‌ 13, 14 తేదీల‌లో రంగారెడ్డి .. హైద‌రాబాద్ జిల్లాల‌లో ప‌ర్య‌టన‌లో సెటిల‌ర్లు నివాసం ఉండే ప్రాంతాలు .. ముస్లీమ్ మేదావులు .. విద్యార్థులు .. నిరుద్యోగులు .. మ‌హిళ‌లతో ప్ర‌త్యేక భేటిలు ఏర్పాటు చేసి వారిని పార్టీ వైపు ఆక‌ర్షించేలా వ్యూహాత్మ‌కంగా ప‌ర్య‌ట‌న‌ను సిద్దం చేస్తుంది.  డిల్లీ నుంచి హైద‌రాబాద్ కు 13వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు రానున్న రాహుల్ గాందీ శంషాబాద్ నుంచి నేరుగా రాజేంద్ర న‌గ‌ర్ లోని క్లాసిక్ ఫంక్ష‌న్ హాల్‌లో రాష్ట్రంలో మ‌హిళా సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌వుతారు, దాదాపు 10 వేల మంది మహిళ‌లు పాల్గొనే ఈ స‌ద‌స్సులో రాహుల్ గాంధీ వారితో దేశంలో, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాలు .. అన్యాయాలు .. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పైన చ‌ర్చించ‌నున్నారు . 

rahul tour

ప్ర‌ధానంగా చ‌ట్ట‌స‌భ‌ల‌లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నా కూడా పార్ల‌మెంట్‌లో బిల్లును ఆమోదించే విష‌యంలో బీజేపీ  ప్ర‌భుత్వం పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌నే అంశాల‌ను రాహుల్  మ‌హిళా సంఘాల‌తో ప్రస్తావించ‌నున్నారు . అలాగే దేశంలో మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న అరాచ‌కాలు .. ప‌సిపిల్ల‌లు .. మ‌హిళ‌ల‌పైన అత్యాచారాలు .. భ‌ద్ర‌త లేక‌పోవ‌డం లాంటి చ‌ర్య‌లు .. దేశంలో మ‌హిళ‌ల ప‌ట్ల ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం వంటి అంశాల‌ను ఈ స‌ద‌స్సులో చ‌ర్చిస్తారు. తెలంగాణ ప్ర‌భుత్వంలో మ‌హిళా మంత్రి లేక‌పోవ‌డం .. మ‌హిళ‌ల‌పైన విప‌రీతంగా దాడులు జ‌రుగుతున్నా నివారించే వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటి వ్య‌వ‌హారాల‌తో తెలంగాణ‌లో మ‌హిళ‌లు తీవ్ర‌మైన ఆందోళ‌న‌లో ఉన్న నేప‌థ్యంలో వారి ప‌ట్ల ప్ర‌భుత్వాల వైఖ‌రిని ఎండ‌గ‌ట్టి మ‌హిళ‌ల‌కు భ‌రోసా ఇచ్చేందుకు రాహుల్ వారితో ప్ర‌త్యేక భేటీ ఏర్పాటు చేసింది పీసీసీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళా సంఘాల‌కు ఆర్థిక ప్రోత్స‌హం లేకుండా పోయిన నేప‌థ్యంలో .. ఇలాంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌ను ఏక‌తాటిపైన తెచ్చేందుకు రాహుల్ గాంధీ చేత రాష్ట్రంలోని మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు .. డ్వాక్రా సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం ఏర్పాటు చేయ‌డం కాంగ్రెస్ పార్టీ మ‌హిళ‌ల‌ను పార్టీ వైపు ఆకర్ఫించే అవ‌కాశాలున్నాయి. 

rahul tour

మ‌హిళ‌ల స‌మావేశం అనంత‌రం శేరిలింగంప‌ల్లిలో ఉత్త‌మ్ బ‌స్సు యాత్ర బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ పాల్గొంటారు, ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టంలో తెలంగాణ .. ఆంధ్రప్ర‌దేశ్ ల‌లో ప్ర‌జ‌ల‌కు హ‌క్కులు క‌ల్పించాల‌ని బిల్లుల‌లో అన్ని ర‌కాలుగా స‌మ‌గ్రంగా అంశాల‌ను చేర్చింది. అయితే టిఆర్ఎస్ మాత్రం హైద‌రాబాద్‌లో నివ‌సించే తెలంగాణేత‌రుల ప‌ట్ల అస‌హ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో ఓట్ల కోసం సెట్లర్ల‌కు కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తా అంటు ప్ర‌గల్బాలు ప‌లికిన కేసిఆర్ తీరా ఆంద్ర ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విష‌యంలో అవిశ్వాసం పెట్టిన‌పుడు ఆంద్రాకు ఎలా హోదా ఇస్తార‌ని .. తెలంగాణ సంగ‌తేమిట‌ని ప్ర‌శ్నించ‌డాన్ని రాహుల్ ప్ర‌స్తావించ‌నున్నారు . ఇక‌ తెలంగాణ రాష్టానికి బిల్లులో పెట్టిన ఒక్క హామీని కూడా నెర‌వేర్చే విష‌యంలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎందుకు విఫ‌ల‌మ‌య్యిన అంశాల‌ను రాహుల్ ఈ స‌భ‌లో ఎండ‌గ‌ట్ట‌నున్నారు.  హైకోర్టు విభ‌జ‌న అంశాన్ని ఇన్ని రోజులు నాన్చుతున్న విష‌యాన్ని ..  కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ..  బ‌య్యారం ఇనుప ప‌రిశ్ర‌మ .. గిరిజ‌న విశ్వ విద్యాయ‌లం మంజూరు .. అంశాల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఎక్క‌డా కేంద్రంతో పోరాట వైఖ‌రి ప్ర‌ధ‌ర్శిచని విష‌యాన్ని.. నోట్ల‌ర‌ద్దు, జి.ఎస్‌.టి, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో బిజెపికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన అంశాల‌ను ఈ శేరిలింగంప‌ల్లి బ‌హిరంగలో ఎండ‌గ‌ట్ట‌నున్నారు రాహుల్ . బిజెపితో అంట‌గాగుతున్న టిఆర్ఎస్‌ను తెలంగాణ‌లో ఉన్న నివాసం ఉంటున్న ఆంద్రా ప్రాంత‌వాసుల ముందు దోషిగా నిల‌బెట్టే వ్యూహంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీతో శేరిలింగంప‌ల్లి వ‌ద్ద స‌భ ఏర్పాటు చేయ‌బోతోంది .

rahul tour

అలాగే ముస్లీం మేధావులతో స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతోపాటు ముస్లీంల ప్రాభ‌ల్యం అధికంగా ఉండే పాత న‌గరంలో ప‌లు ప్రాంతాల‌లో రాహుల్ గాంధీ స‌భ‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన త‌రువాత ముస్లీంల‌పైన దాడులు అధిక‌మ‌య్యిన విష‌యాల‌ను ..  గో ర‌క్ష‌ణ అంటు, బీఫ్ తింటున్నారంటూ అనేక మంది ముస్లీంల‌పైన దాడులు పెరిగిన అంశాల‌ను .. ముస్లీంల‌కు దేశంలో అభ‌ద్ర‌త పెరిగిన విష‌యాల‌ను .. ఈ విష‌యంలో టిఆర్ఎస్ కూడా పెద్ద‌గా ముస్లీంల‌కు అండ‌గా నిలవ‌ని అంశాల‌ను .. ఎంఐఎం తో గులీబీ పార్టీ లోపాయికారిగా బిజెపికి వ‌త్తాసు ప‌లుకుతున్న విష‌యాల‌ను రాహుల్ ఫోక‌స్ చేయ‌నున్నారు .  ఎన్నిక‌ల స‌మ‌యంలో ముస్లీంల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చిన కేసిఆర్ ఆ త‌రువాత ఎలాంటి ముంద‌డుగు వేయ‌కుండా  కేవ‌లం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న నిర్ల‌క్ష్యాన్ని రాహుల్ ఎండ‌గ‌ట్ట‌నున్నారు . 

rahul tour

ఇక‌ యువ పారిశ్రామిక వేత్త‌ల‌తో రాహుల్ గాంధీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు.  నోట్ల ర‌ద్దు త‌రువాత దేశంలో అనేక ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి, నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు విష‌యంలో అనేక ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. యువ పారిశ్రామిక వేత్త‌లు ఎంతో మంది బిజెపి ప్ర‌భుత్వ వైఖ‌రి విష‌యంలో గుర్రుగా ఉన్నారు.వీరికి ఆక‌ర్షించ‌డం ద్వారా రాబోయే ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీకి పారిశ్రామిక వేత్త‌లు బాస‌ట‌గా నిలుస్తార‌నే హామీ రాహుల్ ఇవ్వ‌నున్నారు . అలాగే యువ‌కులు, విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఉస్మానియా యూనివ‌ర్శిటీలో కానీ ఇత‌ర మ‌రెక్క‌డైనా స‌మావేశం ఏర్పాటు చేసి రాహుల్ వారితో చ‌ర్చించేలా పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది .  తెలంగాణ‌లో ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మంలో నిరుద్యోగులు, విద్యార్థులు చాల కీల‌కంగా ప‌నిచేశారు. అయితే ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఒక్క నోటిఫికేష‌న్ కూడా ప్ర‌భుత్వం స‌రిగ్గా  ఇవ్వ‌లేదు. ల‌క్ష ఉద్యోగాలు ఇస్తామ‌న్న తెలంగాణ స‌ర్కార్ పూర్తిగా  విఫ‌ల‌మ‌యింది. ఈ విష‌యంలో  తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్ల విద్యార్థులు, యువ‌కులు తీవ్ర‌మైన ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంత‌లో ఆయా వ‌ర్గాల‌ను కాంగ్రెస్ వైపు ఆక‌ర్శించేందుకు రాహుల్ ప‌ర్య‌ట‌న‌ను ఉప‌యోగించుకునేలా పీసీసీ వ్యూహాత్మ‌కంగా ఏర్పాట్లు చేస్తోంది.

rahul tour

ఈ విధంగా మ‌హిళ‌లు, సెట్ల‌ర్లు, యువ పారిశ్రామిక వేత్త‌లు, విద్యార్థులు, యువ‌కులు, ముస్లీం మేధావులుల‌తో చ‌ర్చ‌లు, ముస్లీంలు అధికంగా ఉండే పాత న‌గ‌రాలు, సెట్ల‌ర్లు అధికంగా ఉండే ప్రాంతాల‌లో స‌భ‌లు జ‌ర‌ప‌డం ద్వారా .. రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌తో అనేక వ‌ర్గాలు కాంగ్రెస్ వైపు ఆక‌ర్షించ‌బ‌డుతాయ‌నే ఆలోచ‌న‌ల‌తో కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌ను ప‌క‌డ్బందీగా, వ్యూహ‌త్మ‌కంగా, ప్ర‌ణాళిక బ‌ద్దంగా ఏర్పాటు చేస్తోంది . దీంతో కాంగ్రెస్ పార్టీ  లో పెద్ద ఎత్తున ఉత్సాహం నిండ‌డంతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల‌లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా ఎదిగేందుకు రాహుల్  ప‌ర్య‌ట‌న ఎంతో తోడ్ప‌డుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి .

rahul tour

rahul tour

tags: Rahul gandhi telangana tour,rahul gandhi,aicc,soniya gandhi,uttam kumar reddy,uttam with rahul gandhi,aicc meeting,cwc meeting,uttam dilhi tour,uttam padmavathi,janareddy,bhatti vikramarka,telangana congress,t.congress,revanthreddy,shabber ali,uttam bus yathra,gandhibhavan,congress meetings,mahila congress meeting with rahul gandhi,dwakra groups,muslim leaders,ou univercity

Related Post