నీతి ఆయోగ్‌లో చంద్ర‌నీతి

news02 June 18, 2018, 3:52 p.m. political

chandra babu with modi

ఢిల్లీ: కొద్ది నెల‌ల క్రితం టీడీపీ-బీజేపీ మ‌ధ్య దోస్తానా క‌టీఫ్ అయిన సంగ‌తి తెలిసిందే. పంచాయితీ ఎక్క‌డ మొద‌లైందో తెలియ‌దు కానీ, ఇరు పార్టీలు విడాకులు తీసుకున్న‌ది విధిత‌మే. దీంతో అప్ప‌టి నుంచి ఈరెండు పార్టీల నేత‌లు క‌త్తులు కూడా దూసుకుంటున్నారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ ఆటంకంగా మారిందంటూ టీడీపీ విమ‌ర్శిస్తుండ‌డ‌గా...ముందు ఇచ్చిన బిల్లుల‌కు లెక్క‌లు పంపండ‌ని బీజేపీ నేత‌లు కౌంట‌ర్ చేస్తున్నారు. 

chandra babu with modi

అంతేకాదు బీజేపీతో తెగ‌తెంపులు అయిన నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కోపం న‌శాలానికి ఎక్కిన‌ట్లుంది. అందుకేనేమో సంధు దొరికితే చాలు మోదీ, కేంద్ర ప్ర‌భుత్వాన్ని క‌డిపారేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు బీజేపీ ఒర‌గ‌బెట్టిందేమిలేద‌నీ ఏకీ పారేశారు. పోల‌వ‌రంకు నిధుల విడుద‌ల‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాపై బీజేపీని ఎండ‌గట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా కేంద్ర ప్ర‌భుత్వం మొండి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని  అనేక సంద‌ర్భాల్లో ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. ఇంతటితో ఆగ‌కుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీయేత‌ర శ‌క్తుల‌తో ఆయ‌న ప‌లు వేదిక‌లు పంచుకున్నారు. ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ‌, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రిల‌తో క‌లిసి ఢిల్లీలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవ‌ల్‌కు మ‌ద్ద‌తు కూడా తెలిపారు. 

chandra babu
అయితే చంద్ర‌న్న బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌తో జ‌ట్టు క‌ట్ట‌డంతో...ఇటు ఏపీతో పాటు..జాతీయ స్థాయిలో బాబు కీల‌క భూమిక పోషించ‌పోతున్నాడ‌ని ఆపార్టీ నేత‌లు భావించారు. అందులో భాగంగానే ఆదివారం జ‌రిగిన నీతి ఆయోగ్ పాల‌క‌మండ‌లి స‌మావేశంలో చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏకీ పారేయ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. అవ‌స‌ర‌మైతే స‌మావేశాన్ని కూడా బాబు బ‌హిష్క‌రించ వ‌చ్చ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. నీతి ఆయోగ్ స‌మావేశంలో బాబు ఇర‌గ‌దీస్తాడ‌నీ, ఇక జ‌రిగేది కురుక్షేత్ర సంగ్రామామే అన్న రీతిలో ప‌సుపు మీడియా కూడా క‌ల‌రింగ్ ఇచ్చింది. ఫ‌లితంగా జాతీయ స్థాయిలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర స‌ర్కారుకు వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్త‌బోతున్న‌ట్లు జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్త‌లు,క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి. 

chandrababu with modi

అయితే ఇందంతా ఒట్టిదేన‌ని తేలింది. నీతి ఆయోగ్ పాల‌క‌మండ‌లిలో చంద్ర‌బాబు ప్ర‌సంగాల‌తో...మోదీకి చుక్క‌లు చూపిస్తాడ‌నుకుంటే...ఆయ‌నే స‌మావేశానికి ముందు మోదీ ముందు మోక‌రిల్ల‌డం విశేషం. అమ‌రావ‌తిలో ఢాంభికాలు ప‌ల్లిక విధంగానే నీతి ఆయోగ్ స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతాడ‌నుకుంటే... నీరుగారిపోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అంతేకాదు స‌మావేశానికి ముందే మ‌మ‌తా,పిన‌ర‌య్‌, కుమార‌స్వామితో క‌లిసి చంద్ర‌బాబు మోదీ ముందు వంగి వంగి దండాలు పెట్టడ‌డం విశేషం. అలాగే మోదీ చేతును త‌న చేతులోకి తీసుకొని బ‌ల‌వంత‌పు న‌వ్వు న‌వ్వ‌డం కొస‌మెరుపు. 

raj deep sardeshai

అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఇది ప్ర‌ధాన వార్త‌లుగా ప్ర‌చురితం కావ‌డంతో...చంద్ర బాబు అస‌లు స్వ‌రూపంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిస్తోంది. మీదికి మాత్రం బాబు బీజేపీతో కుస్తీ ప‌ట్టినా...అంత‌ర్గ‌తంగా దోస్తాన చేస్తున్నాడ‌ని విమ‌ర్శిస్తున్నారు. అంతేకాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌స్య‌ల‌పై కూడా నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి స‌మావేశంలో పెద్దగా చ‌ర్చించ‌క‌పోవ‌డంపై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ప్ర‌ముఖ టీవీ రిపోర్ట‌ర్ రాజ్ దీప్ స‌ర్దేశాయ్ అయితే పిక్ ఆప్ ది డే...హే రాజ‌నీతి అంటూ ట్వీట్ చేయ‌డం విశేషం. మొత్తంగా చంద్ర‌బాబు...మోదీ వ్య‌తిరేక శ‌క్తుల‌తో జ‌ట్టు క‌ట్టిన విధంగా...నీతి ఆయోగ్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్ట‌లేకపోయడ‌ని విశ్లేష‌కులు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం విశేషం. 

tags: niti ayog lo chandra niti, niti ayog meetin, chandrababu with modi,mamata benerjee,pinarai,kejrival,niti aayog,niti aayog ceo,niti aayog vice chairman,niti aayog in hindi,niti aayog internship,niti aayog pdf,niti aayog ceo 2018,niti aayog address,niti aayog chairman 2018,niti aayog ke adhyaksh kaun hai,niti aayog vice chairman 2018,niti aayog adhyaksh,niti aayog aspirational districts,niti aayog adhyaksh kaun hai,niti aayog action agenda,niti aayog action plan niti aayog article,niti aayog aspirational districts list,niti aayog aim,niti aayog amitabh kant,is niti aayog a,nstitutional body,niti aayog is a statutory body,a short note on niti ayog,niti aayog blockchain,niti aayog backward districts,niti aayog body,niti aayog bhel,niti aayog baseline ranking,niti aayog best practices,niti aayog bangalore, niti aayog bihar,niti aayog bhopal,niti aayog blog,difference b/w niti aayog and planning commission,niti aayog chairman niti aayog chairperson,niti aayog careers,niti aayog composition,c

Related Post